త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gurukula School | మార్నింగ్ వాక్‌కు వెళ్లి.. కుప్ప‌కూలిన‌ గురుకుల విద్యార్థి.. ద‌వాఖాన‌కు త‌ర‌లించే లోపే..

Gurukula School | ఖ‌మ్మం జిల్లా రఘునాథపాలెంలో (Raghunadhapalem) విషాదం చోటుచేసుకున్న‌ది. మార్నింగ్ వాక్‌కు వెళ్లి ఓ గురుకుల పాఠ‌శాల‌ విద్యార్థి (Gurukula School) మృతిచెందాడు.

G

Telangana | Published On Sep 9, 2026, 9.37 am IST

Gurukula School | మార్నింగ్ వాక్‌కు వెళ్లి.. కుప్ప‌కూలిన‌ గురుకుల విద్యార్థి.. ద‌వాఖాన‌కు త‌ర‌లించే లోపే..
Advertisement

Gurukula School | త్రినేత్ర‌.న్యూస్‌: ఖ‌మ్మం జిల్లా రఘునాథపాలెంలో (Raghunadhapalem) విషాదం చోటుచేసుకున్న‌ది. మార్నింగ్ వాక్‌కు వెళ్లి ఓ గురుకుల పాఠ‌శాల‌ విద్యార్థి (Gurukula School) మృతిచెందాడు. సాత్విక్ (14) అనే విద్యార్థి రాఘునాథ‌పాలంలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చ‌దువుతున్నాడు. బుధ‌వారం ఉద‌యం తోటి విద్యార్థుల‌తో క‌లిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది హుటాహుటిన అత‌డిని స్థానిక ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే సాత్విక్ చ‌నిపోయాడ‌ని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement