Seed Ganesha | పర్యావరణ హిత వినాయకోత్సవం.. సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే, సంపత్ నంది
Seed Ganesha | గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన పర్యావరణ హిత సీడ్ గణేశ ప్రచారంలో భాగంగా ప్రముఖ నటి పూజా హెగ్డే (P00ja Hegde) ముంబైలోని తన నివాసంలో సీడ్ గణేశుడిని (Seed Ganesha) స్వీకరించారు.
Seed Ganesha | త్రినేత్ర.న్యూస్: గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన పర్యావరణ హిత సీడ్ గణేశ ప్రచారంలో భాగంగా ప్రముఖ నటి పూజా హెగ్డే (P00ja Hegde) ముంబైలోని తన నివాసంలో సీడ్ గణేశుడిని (Seed Ganesha) స్వీకరించారు. వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను కలిపి సహజ మట్టితో తయారు చేసిన ఈ ప్రతిమలను పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చు. అప్పుడు విషపూరిత పీఓపీ విగ్రహాల బదులు ఒక మొక్క పెరిగి, భక్తి తో పాటు పచ్చదనం కూడా మిగులుతుంది.
ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ (Santhosh Kumar) ముంబై భక్తులకు పిలుపునిస్తూ.. ఈ గణేశోత్సవంలో భక్తిని ప్రకృతి పరిరక్షణతో మేళవించాలని, నీటి వనరులను కలుషితం చేసే రసాయన రంగుల విగ్రహాలను వదిలేయాలని కోరారు. ప్రతిఒక్కరు సీడ్ గణేశ పూజ చేయాలని, మొక్కను పెంచాలని, ఇంకో ముగ్గురిని నామినేట్ చేసి పచ్చని వినాయకుడిని జరుపుకోవాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) విజ్ఞప్తి చేసింది.

సంపత్ నంది..
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత సంపత్ నంది (Sampath Nandi) గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం నుంచి సీడ్ గణేశా విగ్రహాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సీడ్ గణేశా పెట్టెను తెరిచి విగ్రహాన్ని చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ (GIC) వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణహిత సీడ్ గణేశా కార్యక్రమంలో భాగంగా సినీపరిశ్రమ ప్రముఖులకు ఈ పర్యావరణ అనుకూల విగ్రహాలు అందజేస్తున్నారు. సంపత్ నంది గతంలో కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో విస్తృతంగా పాల్గొన్నారు.

సీడ్ గణేశా విగ్రహాలు సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి పొడితో తయారు చేసి, వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను పొందుపరుస్తారు. పూజలు పూర్తయిన తర్వాత ఇంట్లోనే మట్టిలో ఉంచితే విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయి. POP విగ్రహాల వల్ల జలాలు కలుషితం కాకుండా భక్తితో పాటు పచ్చదనం కూడా పెరుగుతుంది.
గణేశ్ చతుర్థి 2026 సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్రీన్ ఇండియా చాలెంజ్ సీడ్ గణేశా కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించారు. సినీ, రాజకీయ, సామాజిక రంగాల నుంచి పలువురు ఈ సీడ్ గణేశకి మద్దతు తెలుపుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 2018లో ప్రారంభమై `మూడు మొక్కలు నాటండి, మూడేళ్లు సంరక్షించండి, మరో ముగ్గురిని నామినేట్ చేయండి` అనే నినాదంతో దేశవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటింది. సీడ్ గణేశా ద్వారా భక్తి, సాంప్రదాయం,పర్యావరణ పరిరక్షణ ఒక్కటి అవుతాయని GIC బృందం పిలుపునిచ్చింది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anaswara Rajan | చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘కాకా’ ఫస్ట్ లుక్ విడుదల
సెప్టెంబర్ 8, 2026

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026

Chiranjeevi | సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడిపై చిరంజీవి ప్రశంసల జల్లు
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Telangana Language Day | నేడు ప్రజాకవి కాలోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం
- ●Assembly Session | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ
- ●SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
- ●Horoscope | సెప్టెంబర్ 9 రాశిఫలాలు.. అతిగా విశ్లేషించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!
- ●రాజకీయం వేడెక్కాలి.. రాష్ట్రం కాదు: అధికార పక్షం దూకుడుపై విశ్లేషణ!
- ●Osmania University | బేగంపేట నిఖితకు ఐదు గోల్డ్ మెడల్స్

Telangana Language Day | నేడు ప్రజాకవి కాలోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం

Assembly Session | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ

SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్

Horoscope | సెప్టెంబర్ 9 రాశిఫలాలు.. అతిగా విశ్లేషించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!



