త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో కుదుపు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..

Stock Markets |భారత ఈక్విటీ మార్కెట్లు సోమవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,300 స్థాయికి దిగువకు చేరింది. శుక్రవారం నమోదైన పతనం కొనసాగుతుండగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

S

Business | Published On Aug 17, 2026, 10.29 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో కుదుపు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
Advertisement

Stock Markets |భారత ఈక్విటీ మార్కెట్లు సోమవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,300 స్థాయికి దిగువకు చేరింది. శుక్రవారం నమోదైన పతనం కొనసాగుతుండగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ గత ముగింపు 78,009.25తో పోలిస్తే స్వల్పంగా పెరిగి 77,892.92 వద్ద ప్రారంభమైనప్పటికీ, ఉదయం ట్రేడింగ్‌లో 77,655.64 కనిష్ఠానికి పడిపోయింది. మరోవైపు నిఫ్టీ గత ముగింపు 24,366తో పోలిస్తే స్వల్పంగా తగ్గి 24,343.45 వద్ద ప్రారంభమైంది. విస్తృత మార్కెట్ సూచీలన్నీ ఎరుపు రంగులో ట్రేడయ్యాయి. రంగాల వారీగా చూస్తే ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్, కెమికల్ రంగాలు మాత్రం లాభాల్లో ట్రేడయ్యాయి.

ఐటీ షేర్ల ప‌త‌నం..

ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ, పీఎస్‌యూ సూచీలు అత్యధికంగా నష్టపోయిన రంగాలుగా నిలిచాయి. ఇవి ఒక్క శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 334.20 పాయింట్లు (0.43 శాతం) నష్టంతో 77,675.05 వద్ద, నిఫ్టీ 68.20 పాయింట్లు (0.29 శాతం) నష్టంతో 24,294.60 వద్ద ట్రేడయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో మ్యాక్స్ హెల్త్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ తదితర షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ తదితర షేర్లు మార్కెట్‌ను ఎక్కువగా లాగి కిందకు తీసుకెళ్లిన షేర్లుగా నిలిచాయి. అదేవిధంగా బీఎస్‌ఈలో ఎటర్నల్, టైటాన్, బీఈఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, మారుతి, పవర్ గ్రిడ్ తదితర షేర్లు టాప్ ల్యాగార్డ్స్‌గా నిలిచాయి.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సుమారు 88.88 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే డ‌బ్ల్యూటీఐ ముడి చమురు ధర సుమారు 82.45 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మళ్లీ ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.59 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 18 పైస‌ల మేర న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement