Draft Voter List | నేడు ముసాయిదా ఓటర్ల జాబితా.. 92 లక్షల మందికి నోటీసులు!
Draft Voter List | రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే ముగింపు దశకు చేరుకుంది. జూన్ 25న ప్రారంభమైన సర్.. ఆగస్టు 10 వరకు బీఎల్‌వోలు (BLO) ఇంటింటి సర్వే నిర్వహించారు. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Voter List) ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు.
Draft Voter List | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే ముగింపు దశకు చేరుకుంది. జూన్ 25న ప్రారంభమైన సర్.. ఆగస్టు 10 వరకు బీఎల్‌వోలు (BLO) ఇంటింటి సర్వే నిర్వహించారు. ఓటర్లు నింపిఇచ్చిన ఎన్యుమరేషన్ పత్రాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ పూర్తిచేశారు. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Voter List) ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. 2 కోట్ల 64 లక్షల 87 వేల 214 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను సోమవారం మధ్యాహ్నం వెల్లడించనున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని సీఈవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించనున్నారు. అనంతరం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేసి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు.
కాగా, ఇప్పటికే సుమారు 73 లక్షల ఓట్లు తగ్గిపోగా ఎన్యుమరేషన్ ఫారాలు (Enumeration Form) ఇచ్చిన వారిలో 92 లక్షల మందికి పైగా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం సిద్ధం చేసింది. నోటీసు వస్తే ఈసీ ప్రకటించిన 12 డాక్యుమెంట్ల ద్వారా అర్హత ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఇంటింటి సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అధికారులు అందించారు. సర్వే ముగిసే నాటికి 2,64,87,214 (78.30 శాతం) మంది ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. దీని ప్రకారం ఎన్యూమరేషన్ పత్రాలలో ఎస్‌ఐఆర్-2002 ఓటరు జాబితాలోని వివరాలు నమోదు చేయని (మ్యాపింగ్‌కాని) ఓటర్లందరికీ నోటీసులు ఇవ్వనున్నారు.
ఎలా చెక్‌చేసుకోవాలంటే..
జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఈఆర్వో, ఏఈఆర్వో, పోలింగ్ బూత్ వద్ద ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తారు.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ జాబితాను అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు తమ ఓటు మ్యాపింగ్ జరిగిందా? ఏమైనా నోటీసులు వచ్చాయా? అనే వివరాలు తెలుసుకోవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●UGC NET | తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష
- ●Horoscope | ఆగస్టు 17 రాశి ఫలాలు.. ఈ రాశివారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి!
- ●Prajavani | మండల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి
- ●KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!
- ●Bandla Ganesh Daughter Wedding | ఘనంగా బండ్ల గణేష్ కూతురు వివాహం - టాలీవుడ్ స్టార్స్ సందడి
- ●Anupama Parameswaran | టాలీవుడ్ హీరోల్లో అతడే నా క్లోజ్‌ఫ్రెండ్ - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్

UGC NET | తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష

Horoscope | ఆగస్టు 17 రాశి ఫలాలు.. ఈ రాశివారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి!

Prajavani | మండల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి

KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!




