Stock Markets | వరుసగా రెండు వారాల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా రెండు వారాలుగా కొనసాగిన లాభాల పరంపరకు బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలపై ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా రెండు వారాలుగా కొనసాగిన లాభాల పరంపరకు బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలపై ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 71 పాయింట్లు (0.09 శాతం) నష్టపోయి 78,009.25 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు చెందిన నిఫ్టీ 50 సూచీ 30 పాయింట్లు (0.12 శాతం) పడిపోయి 24,366 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు మార్కెట్‌లో మరింత బలహీన ప్రదర్శన చేశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.53 శాతం క్షీణించగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.69 శాతం పడిపోయింది.
పెరిగిన చమురు ధరలు..
వారాంతపు లెక్కలను పరిశీలిస్తే.. సెన్సెక్స్ మొత్తం 490 పాయింట్లు (0.62 శాతం) నష్టపోయింది. నిఫ్టీ 50 కూడా 205 పాయింట్లు (0.83 శాతం) పతనమైంది. అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 మాత్రం వారంలో 0.50 శాతం లాభపడింది. మరోవైపు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.65 శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా మార్కెట్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునే ధోరణిని ఇష్టపడడం లేదని మార్కెట్లను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర 0.15 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.35 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 81 డాలర్లకు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి కాస్త బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.41 వద్ద ఉన్న రూపాయి ఈ సెషన్‌లో 0.02 శాతం లాభపడింది.
అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావం..
కేవలం దేశీయ స్టాక్ మార్కెట్లే కాకుండా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలోనూ తీవ్ర అస్థిరత చోటు చేసుకుంది. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా బాండ్ ఈల్డ్స్ కూడా వృద్ధిలో కొనసాగే అవకాశాలు ఉండడం, భౌగోళిక అనిశ్చితులు, అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై సందేహాలు తదితర అంశాలన్నీ మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. అయితే వచ్చే వారం మార్కెట్లకు కీలకమని, రానున్న వారం రోజులు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..
ఆగస్టు 14, 2026

Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
ఆగస్టు 13, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Motorola Moto G Max | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- ●George Krish | శర్వానంద్ జార్జ్ క్రిష్ షురూ - ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
- ●Supreme Court | ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..
- ●MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు
- ●Kiara Advani | కియారా అద్వానీకి బాడీగార్డ్‌లా మారిన యశ్ - ప్రెగ్నెన్సీతోనే షూటింగ్
- ●Census 2027 | కులం, కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు.. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం

Motorola Moto G Max | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..

George Krish | శర్వానంద్ జార్జ్ క్రిష్ షురూ - ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పేశారుగా!

Supreme Court | ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..

MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు



