Stampede | శ్రావణ సోమవారం.. ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
Stampede | బీహార్‌లోని (Bihar) లఖిసరాయ్ జిల్లాలో ఉన్న ప్రముఖ అశోక్ ధామ్ ఆలయంలో (Ashok Dham Temple) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆలయంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఏడుగురు భక్తులు మృతిచెందారు.
Stampede | త్రినేత్ర.న్యూస్: బీహార్‌లోని (Bihar) లఖిసరాయ్ జిల్లాలో ఉన్న ప్రముఖ అశోక్ ధామ్ ఆలయంలో (Ashok Dham Temple) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆలయంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఏడుగురు భక్తులు మృతిచెందారు. పదుల సంఖ్యలో భక్తులు (Devotees ) గాయపడ్డారు. శ్రావణ మాసం (Sravana Somavaram) మూడో సోమవారం (ఉత్తరాది లెక్కల ప్రకారం) కావడంతో జలాభిషేకం చేయడానికి సుమారు 50 వేల మంది వరకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో విద్యుత్ తీగ (Power Line) అకస్మాత్తుగా తెగిపడింది. భయాందోళనలకు గురైన ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు పరుగులు తీశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఒకరినొకరు తోసుకోడంతో కిందపడి నలిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని దవాఖానలకు తరలించారు. మృతులంతా మహిళలనే తెలుస్తున్నది. మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిందని డీఎం శైలేంద్ర కుమార్ వెల్లడించారు.
జలాభిషేకం కోసం..
సోమవారం ఉదయం భక్తులు జలాభిషేకం కోసం (Jalabhishekam) ఆలయానికి చేరుకున్నారని, ఆ సయంలో ఒక విద్యుత్ స్తంభం వద్ద వైర్ తెగిపడిపోయిందని చెప్పారు. దాని వల్ల షాక్ కొడుతుందని ఎవరో జనాలను భయపెట్టారని వెల్లడించారు. దీంతో ఆలయం చుట్టూ భయాందోళనలు చెలరేగాయి. ప్రజలు పరుగులు పెట్టడం ప్రారంభించారు చాలా మంది భక్తులు ఒకరి కింద ఒకరు నలిగిపోయారని తెలిపారు.
అత్యంత విషాదకరం: సీఎం చౌదరి
లఖిసరాయ్‌లోని అశోక్‌ధామ్‌లో జరిగిన సంఘటన అత్యంత విషాదకరమని బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి (Samrat Choudhary) అన్నారు. హృదయ విదారకమని పేర్కొన్నారు. ప్రమాదంలో భక్తులు మరణించారన్న వార్త విని నా హృదయం దుఃఖంతో నిండిపోయిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
#BREAKING: At least 7 devotees killed in stampede at Ashok Dham temple in #Lakhisarai; several injured
📍BIHAR pic.twitter.com/MSOSSVR1nW
— Karan Singh / करन सिंह (@Journo_Karan) August 17, 2026
సంబంధిత వార్తలు

Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి ఒకరు మృతి, 200 మందికి గాయాలు
జులై 16, 2026

Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!
జులై 11, 2026

Tirumala | మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 లక్షల మందికిపైగా భక్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●MCR TIMS | బిగ్ డే.. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయి: మంత్రి దామోదర
- ●Special Police Officer | హైదరాబాద్ సిటీలో 150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు.. అర్హులు ఎవరంటే?
- ●Hyderabad | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకోమంటే కత్తితో పొడిచి చంపాడు
- ●Draft Voter List | నేడు ముసాయిదా ఓటర్ల జాబితా.. 92 లక్షల మందికి నోటీసులు!
- ●UGC NET | తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష
- ●Horoscope | ఆగస్టు 17 రాశి ఫలాలు.. ఈ రాశివారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి!

MCR TIMS | బిగ్ డే.. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయి: మంత్రి దామోదర

Special Police Officer | హైదరాబాద్ సిటీలో 150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు.. అర్హులు ఎవరంటే?

Hyderabad | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకోమంటే కత్తితో పొడిచి చంపాడు

Draft Voter List | నేడు ముసాయిదా ఓటర్ల జాబితా.. 92 లక్షల మందికి నోటీసులు!



