త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UGC NET | త‌ప్పుల త‌డ‌క‌గా ప్ర‌శ్న‌ప‌త్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష

UGC NET | జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులతోపాటు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ యూజీసీ నెట్‌ (UGC NET) ప్రవేశ పరీక్షల్లో భారీగా త‌ప్పులు దొర్లాయి.

G

National | Published On Aug 17, 2026, 6.09 am IST

UGC NET | త‌ప్పుల త‌డ‌క‌గా ప్ర‌శ్న‌ప‌త్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష
Advertisement

UGC NET | త్రినేత్ర‌.న్యూస్‌: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులతోపాటు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ యూజీసీ నెట్‌ (UGC NET) ప్రవేశ పరీక్షల్లో భారీగా త‌ప్పులు దొర్లాయి. దీంతో మూడు స‌బ్జెక్టుల ప‌రీక్ష‌ల‌ను మ‌ళ్లీ (Re Exam) నిర్వ‌హించాల‌ని ఎన్టీఏ నిర్ణ‌యించింది. ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని, సెప్టెంబ‌ర్‌లో అవి ఉంటాయ‌ని ప్రకటించింది. ఇంగ్లిష్‌ (English) పేపర్‌ను సెప్టెంబర్ 9న షిఫ్ట్‌-1 (ఉదయం 9- మధ్యాహ్నం 12 వరకు)లో, కామర్స్‌  (Commerce) పేపర్‌ను షిఫ్ట్‌-2 (మధ్యాహ్నం 3- సాయంత్రం 6 వరకు)లో, సోషియాలజీ (Sociology)పరీక్షను సెప్టెంబర్‌ 10వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామని వెల్ల‌డించింది.

అక్ష‌ర దోషాలు, అనువాద లోపాలు..

యూజీసీ నెట్ ప‌రీక్ష‌ల‌ను జూన్‌లో నిర్వ‌హించింది. అయితే ఈ మూడు పేప‌ర్ల ప్ర‌శ్న‌ప‌త్రాల్లో పెద్దఎత్తున త‌ప్పులు ఉన్నట్లు అభ్య‌ర్థుల నుంచి ఫిర్యాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విష‌య‌మై ఎన్‌టీఏ నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపిన క‌మిటీ ఇంగ్లిష్‌, సోషియాల‌జీ, కామ‌ర్స్ స‌బ్జెక్టుల్లో అక్ష‌ర దోషాలు, అనువాద లోపాలు, వ్యాక‌ర‌ణ దోషాలు ఉన్నా త‌ప్పులు ఉన్నాయని తేల్చింది. ముఖ్యంగా ప్రముఖ రచయితల పేర్లు తప్పుగా ముద్రించడం, పుస్తకాల పేర్లలో లోపాలు ఉండటం, పాత ప్రశ్నలే మళ్లీ మళ్లీ ఇవ్వడం లాంటి అనేక సాంకేతిక లోపాలున్న‌ట్లు పేర్కొంది. ఆ ప్ర‌శ్న‌ల‌ను తొల‌గించ‌డం ద్వారా స‌మ‌స్య‌కు స‌రైన ప‌రిష్కారం ల‌భించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఆ మూడు స‌బ్జెక్టుల‌ ప‌రీక్ష‌ల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్టీఏ ప్ర‌క‌టించింది.

ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ..

ఈ రీ-ఎగ్జామ్ రాయాల్సిన అభ్యర్థులు మళ్లీ ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. కొత్త పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లు, అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలో ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామ‌న్నారు. మొత్తం 87 సబ్జెక్టులకు జూన్ 22 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించగా.. వీటిలో 84 సబ్జెక్టులకు ప్రొవిజినల్‌ ఆన్సర్‌ ‘కీ’లు, అభ్యర్థుల రెస్పాన్స్‌ కాపీలను ప్రస్తుతం అందుబాటులో ఉంచింది.

రీ-ఎగ్జామ్ షెడ్యూల్ ఇలా..

సెప్టెంబర్ 9- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు- ఇంగ్లిష్‌ పేపర్
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వరకు- కామర్స్‌ పేపర్‌
సెప్టెంబర్ 10న- ఉదయం 9 నుంచి 12 గంటల వ‌రకు- సోషియాలజీ పరీక్ష

 

Advertisement
Advertisement