త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Police Officer | హైద‌రాబాద్ సిటీలో 150 స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్లు.. అర్హులు ఎవ‌రంటే?

Special Police Officer | హైదరాబాద్ సిటీ పోలీస్ (Hyderabad City Police) శాఖలో ఖాళీగా ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (Special Police Officer) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

G

Hyderabad | Published On Aug 17, 2026, 8.05 am IST

Special Police Officer | హైద‌రాబాద్ సిటీలో 150 స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్లు.. అర్హులు ఎవ‌రంటే?
Advertisement

Special Police Officer | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్ సిటీ పోలీస్ (Hyderabad City Police) శాఖలో ఖాళీగా ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (Special Police Officer) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు 25 వ‌ర‌కు ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.26,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈపోస్టులు తాత్కాలిక ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు.

పోస్టు పేరు: స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌
మొత్తం పోస్టులు: 150
అర్హ‌త‌లు: మాజీ సైనికులు, వయస్సు 58 సంవత్సరాల లోపు ఉండాలి. రిటైర్డ్ పారామిలటరీ, పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొందిన రెండేళ్లలోపు వారై ఉండాలి. వీరికి గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులు: ఆఫ్‌లైన్‌లో

హైదరాబాద్, పెట్లబుర్జులోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఎస్​పీవో కార్యాలయంలో స్వ‌యంగా దరఖాస్తులు స‌మ‌ర్పించాలి. డిశ్చార్జ్ లేదా రిటైర్మెంట్ సర్టిఫికెట్ తప్పనిసరి. అదేవిధంగా ఆధార్, పాన్ కార్డ్, ఎస్‌బీఐ బ్యాంక్ పాస్‌బుక్, ఓటరు ఐడీ, కుల ధృవీకరణ పత్రం, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, డ్రైవర్ పోస్టులకు అప్ల‌య్‌ చేయాలనుకునేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాల ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలి.

దరఖాస్తులకు చివ‌రితేదీ: ఆగస్టు 25 సాయంత్రం 5 గంటల వరకు

Advertisement
Advertisement