త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karne Prabhakar | ఏక‌ప‌క్ష నిర్ణ‌యం.. రేవంత్ అహంకార‌పూరిత వైఖ‌రికి నిద‌ర్శ‌నం : మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్

Karne Prabhakar | యాదాద్రి అభివృద్ధి సంస్థ (YTDA)లో యాదాద్రి జిల్లా ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ట్ర‌స్ట్ బోర్డు విష‌యంలో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. సీఎం రేవంత్ రెడ్డి అహంకార‌పూరిత వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On Jul 1, 2026, 5.02 pm IST

Karne Prabhakar | ఏక‌ప‌క్ష నిర్ణ‌యం.. రేవంత్ అహంకార‌పూరిత వైఖ‌రికి నిద‌ర్శ‌నం : మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్
Advertisement

Karne Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : యాదాద్రి అభివృద్ధి సంస్థ (YTDA)లో యాదాద్రి జిల్లా ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ట్ర‌స్ట్ బోర్డు విష‌యంలో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. సీఎం రేవంత్ రెడ్డి అహంకార‌పూరిత వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు.

దేవుడి మీద ప్రమాణం చేసి ప్రజలను నమ్మించిన రేవంత్ రెడ్డి, అదే దేవుడిపై శఠగోపం పెట్టి రాజకీయాలు చేయడం దురదృష్టకరం. యాదగిరిగుట్ట పేరుతో ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, యాదాద్రి అభివృద్ధి సంస్థ (YTDA)లో కనీస ప్రాతినిధ్యం కూడా కల్పించకపోవడం పట్ల భారత రాష్ట్ర సమితి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని దేశంలోనే అత్యంత వైభవోపేత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.1800 కోట్ల వ్యయంతో యాదాద్రిని అభివృద్ధి చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పారని క‌ర్నె ప్ర‌భాక‌ర్ గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది..

దేవాలయ అభివృద్ధి కోసం పరిసర గ్రామాల ప్రజలు తమ భూములను స్వచ్ఛందంగా సమర్పించి, భక్తితో సహకరించారు. యాదాద్రి అభివృద్ధిలో స్థానిక ప్రజల పాత్ర, సహకారం ఎంతో గొప్పవి. అలాంటి ప్రాంతం నుండి వైటీడీఏలో స్థానం లేకపోవడం అన్యాయం. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సైతం ప్రశ్నించడం గమనార్హం. యాదాద్రి జిల్లా ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

రాక్షసానందం పొందాలనుకుంటున్నాడు

తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్ నిర్మించిన సంస్థలను రాజకీయ కక్షతో బలహీనపరచడం, వ్యవస్థలను నిర్వీర్యం చేసి తద్వారా రాక్షసానందం పొందాలనుకుంటున్నాడు. యాదాద్రి జిల్లా పేరుతో ఏర్పడిన అభివృద్ధి సంస్థలో అదే జిల్లా ప్రజలకు, స్థానికులకు, దేవాలయ అభివృద్ధికి భూములు ఇచ్చిన కుటుంబాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది అని క‌ర్నె ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement