India EV | జూన్‌లో ఈవీ ద్విచక్ర వాహనాల దూకుడు.. రోజుకు 6 వేలకుపైగా అమ్మకాలు..
India EV | భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈ2డబ్ల్యూ) మార్కెట్ జూన్ లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చులు, మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరిగింది. దీంతో జూన్ నెలలో రోజుకు సగటున 6 వేలకుపైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
Automobiles | Published On Jul 1, 2026, 4.46 pm IST
India EV | భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈ2డబ్ల్యూ) మార్కెట్ జూన్ లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చులు, మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరిగింది. దీంతో జూన్ నెలలో రోజుకు సగటున 6 వేలకుపైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇది ఇప్పటివరకు నమోదైన రెండో అత్యధిక నెలవారీ అమ్మకాల స్థాయిగా నిలిచింది. వాహన్ డేటా ప్రకారం జూన్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు వార్షిక ప్రాతిపదికన 64 శాతం పెరిగి 1,81,168 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు సుమారు 3,600 మాత్రమే ఉండగా, ఈసారి ఆ సంఖ్య 6 వేల మార్క్‌ను దాటడం గమనార్హం.
టీవీఎస్ మోటార్స్ అగ్ర స్థానంలో..
మార్కెట్లో టీవీఎస్ మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జూన్ నెలలో కంపెనీ 44,467 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది జూన్‌లో నమోదైన 26,911 యూనిట్లతో పోలిస్తే 65.2 శాతం వృద్ధి కాగా కంపెనీ మార్కెట్ వాటా గతేడాది 24.7 శాతం ఉంది. ఈసారి స్వల్పంగా తగ్గి 24.5 శాతానికి చేరినా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రెండో స్థానంలో బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీ జూన్‌లో 40,576 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది ఇదే నెలలో నమోదైన 24,013 యూనిట్లతో పోలిస్తే 69 శాతం అధికం. మార్కెట్ వాటా కూడా 21.5 శాతం నుంచి 22.4 శాతానికి పెరగడంతో అగ్రస్థానంలోని టీవీఎస్‌కు మరింత దగ్గరైంది. మూడో స్థానంలో ఏథర్ ఎనర్జీఉంది. కంపెనీ 29,422 వాహనాలను విక్రయించగా, ఇది గతేడాది 16,392 యూనిట్లతో పోలిస్తే 79.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ వాటా కూడా 14.7 శాతం నుంచి 16.2 శాతానికి పెరిగిందని వాహన్ డేటా వెల్లడించింది.
వాటాను కోల్పోతున్న ఓలా ఎలక్ట్రిక్..
ఒకప్పుడు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వరుసగా వాటాను కోల్పోతోంది. జూన్ లో కంపెనీ 15,096 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 20,697 యూనిట్లతో పోలిస్తే ఇది 27.1 శాతం తగ్గుదల. మార్కెట్ వాటా కూడా 18.6 శాతం నుంచి కేవలం 8.3 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో ఇది 6 శాతానికి పడిపోయిన తర్వాత, మేలో 8.8 శాతానికి స్వల్పంగా కోలుకుని, జూన్‌లో 8.3 శాతంగా నమోదైంది. హీరో మోటోకార్ప్ మద్దతుతో ఉన్న విడా కూడా వేగంగా ఎదుగుతోంది. కంపెనీ జూన్‌లో 20,198 రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 7,945 మాత్రమే. దీంతో మార్కెట్ వాటా 7.1 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగింది. ఇక ఇతర కంపెనీల విభాగంలో మొత్తం 31,381 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించారు. మొత్తం మార్కెట్‌లో వీటి వాటా 17.3 శాతంగా ఉండటంతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో పోటీ మరింత తీవ్రంగా కొనసాగుతున్నట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
ఆగస్టు 8, 2026

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
జులై 29, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
జులై 22, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



