Hong Myung-bo | ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే ఇంటికి.. దక్షిణ కొరియా కోచ్ హాంగ్ మ్యుంగ్ బో రాజీనామా
Hong Myung-bo | ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే దక్షిణ కొరియా నిష్క్రమించడంతో ఆ జట్టు ప్రధాన కోచ్ హాంగ్ మ్యుంగ్-బో తన పదవికి రాజీనామా చేశారు. మెక్సికో గ్వాడలాహారాలో నిర్వహించిన జట్టు శిక్షణ శిబిరంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
Hong Myung-bo | ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే దక్షిణ కొరియా నిష్క్రమించడంతో ఆ జట్టు ప్రధాన కోచ్ హాంగ్ మ్యుంగ్-బో తన పదవికి రాజీనామా చేశారు. మెక్సికో గ్వాడలాహారాలో నిర్వహించిన జట్టు శిక్షణ శిబిరంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. టోర్నీలో జట్టు వైఫల్యానికి పూర్తి బాధ్యత తనదేనని అంగీకరించిన ఆయన.. అభిమానులకు క్షమాపణలు చెప్పారు. "జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం సులభం కాదు. అయినా, అప్పగించిన బాధ్యతను చివరి వరకు నిర్వర్తించేందుకు ప్రయత్నించాను. ప్రజలు ఆశించిన ఫలితాలు అందించలేకపోయాను. అందుకు పూర్తి బాధ్యత నాదే. కొరియా ఫుట్‌బాల్ అభిమానులందరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను" అని హాంగ్ పేర్కొన్నారు.
2024లో బాధ్యతలు..
జూలై 2024లో జుర్గెన్ క్లిన్స్‌మన్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన హాంగ్.. దక్షిణ కొరియాను వరుసగా 11వ ప్రపంచకప్‌కు అర్హత సాధించేలా చేశారు. సన్ హ్యూంగ్-మిన్, లీ కాంగ్-ఇన్, కిమ్ మిన్-జే వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌పై 2-1తో గెలిచిన కొరియా.. ఆ తర్వాత మెక్సికో, దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా ఓటమిపాలైంది. ఆ తర్వాత కాంగో 3-1తో ఉజ్బెకిస్తాన్‌ను ఓడించడంతో కొరియా నాకౌట్ ఆశలు అడియాశలయ్యాయి.
దేశ అధ్యక్షుడి తీవ్ర అసంతృప్తి
ఫుట్‌బాల్ టీమ్ వైఫల్యం దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రతిభ కంటే విధేయత, వర్గ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. హాంగ్ నియామకం వెనుక జరిగిన నిర్ణయాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది" అని వ్యాఖ్యానించారు. జాతీయ జట్టు ప్రదర్శనతో పాటు ఫుట్‌బాల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో సమగ్ర విచారణ చేపట్టాలని సాంస్కృతిక, క్రీడలు, పర్యాటక మంత్రిత్వ శాఖను ఆయన ఆదేశించారు. జట్టు ప్రదర్శన దేశ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో సంస్కరణలు తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. 2014 బ్రెజిల్ ప్రపంచకప్‌లో హాంగ్ మ్యుంగ్-బో సారథ్యంలోనే దక్షిణ కొరియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2002లో సెమీఫైనల్ చేరగా.. వరుసగా 11 ప్రపంచకప్‌ల్లో పాల్గొన్న చరిత్ర ఉన్నప్పటికీ తాజా వైఫల్యాలు ఆ దేశ ఫుట్‌బాల్ భవిష్యత్‌పై చర్చ మొదలైంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్
- ●Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్
- ●Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది - లిరిక్స్ ఇవిగో...
- ●Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే
- ●China Ladakh Names Row | లడఖ్‌లోని 28 కీలక ప్రాంతాలకు భారత్ పేర్లు: తట్టుకోలేక విషం కక్కిన చైనా
- ●Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు నీటి భరోసా!

DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్

Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్

Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది - లిరిక్స్ ఇవిగో...

Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే






