Suriya | జై భీమ్ కాంబో రిపీట్ – కేజీఎఫ్ నిర్మాతతో సూర్య సినిమా – పద్మశ్రీ అవార్డ్ విన్నర్ జీవిత కథతో…
జై భీమ్ తర్వాత సూర్య, డైరెక్టర్ టీజే జ్ఞానవేళ్ కాంబోలో మరో సినిమా రాబోతుంది. కేజీఎఫ్, సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది. సోమవారం ఈ పాన్ ఇండియన్ మూవీని అఫీషియల్ గా ప్రకటించారు.
Entertainment | Published On Jun 29, 2026, 3.34 pm IST
Suriya | సూర్య హీరోగా డైరెక్టర్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో రూపొందిన జై భీమ్ అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రీసెంట్ టైమ్‌లో తమిళంలో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. జై భీమ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. సూర్య హీరోగా టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. కేజీఎఫ్, సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కబోతుంది.
గర్వంగా ఉంది....
ఈ సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల మనుసులను కదిలించేలా నిజాయితీ కలిగిన ఓ అర్థవంతమైన కథను వెండితెరపై ఆవిష్కరించబోతుండటం గర్వంగా ఉందంటూ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. సూర్య హీరోగా నటిస్తోన్న 48వ మూవీ ఇది. తమిళంలో నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. సూర్య, టీజే జ్ఞానవేళ్ మూవీ లాంఛింగ్ ఈవెంట్ సోమవారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రెండు రూపాయల డాక్టర్
జై భీమ్ తరహాలోనే ఈ సినిమా కూడా బయోపిక్ అని టాక్ వినిపిస్తోంది. చెన్నైలో రెండు రూపాయల డాక్టర్‌గా ఫేమస్ అయిన తిరువెంగడం వీరరాఘవన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. పేదలకు తక్కువ ధరకు వైద్యం అందించిన వీరరాఘవన్‌ను ప్రభుత్వం 2021లో పద్మశ్రీతో సత్కరించింది. డాక్టర్‌గా మారే క్రమంలో అతడు ఎదుర్కొన్న కష్టాలు? రెండు రూపాయల ఫీజుతో క్లినిక్ నడిపిన అతడికి కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనే అంశాలతో ఫిక్షనల్ బయోపిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.
విశ్వనాథ్ అండ్ సన్స్...
ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేస్తోన్నారు సూర్య. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌తో దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా సినిమా చేయబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sharmiela Mandre | తమిళ నిర్మాతతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్ – ఫొటోలు వైరల్
జూన్ 28, 2026

Khushbu | కూతురి పెళ్లి ఫొటోలపై విమర్శలు – నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ
జూన్ 28, 2026

Kollywood | భాగ్యరాజ్‌కు నివాళులు అర్పించిన సీఎం విజయ్ – కళ్లను దానం చేసిన దిగ్గజ దర్శకుడు
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే
- ●Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
- ●Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- ●Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్..

Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!

Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే

Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం



