Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి
Sridhar Babu | తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఈ భేటీలో ‘తెలంగాణ-జర్మనీ’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే అవకాశాలపై చర్చించినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు.
- జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని కోరిన మంత్రి శ్రీధర్ బాబు
త్రినేత్ర.న్యూస్: తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. బవేరియన్ (జర్మనీ) మినిస్ట్రీ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్, రీజినల్ డెవలప్‌మెంట్ అండ్ ఎనర్జీ వైస్ మినిస్టర్ టోబియాస్ గోత్‌హార్ట్ నేతృత్వంలోని జర్మనీ బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో ‘తెలంగాణ-జర్మనీ’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే అవకాశాలపై చర్చించినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు.

పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు.
లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, ఏరో స్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, సెమీకండక్టర్లు, ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ, ఏఐ, డిజిటల్ హెల్త్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, క్లీన్ ఎనర్జీ, జీసీసీలు, ఇండస్ట్రీ 4.0 తదితర రంగాల్లో తెలంగాణలో విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికత, పరిశోధన, ఇన్నోవేషన్, స్కిల్లింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. సమగ్ర ఎకోసిస్టమ్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. ‘తెలంగాణ-జర్మనీ’ మధ్య భాగస్వామ్యాన్ని పెట్టుబడులకే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాలకూ విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం అని మంత్రి జర్మనీ ప్రతినిధి బృందానికి వివరించారు.
ఈ సమావేశంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్, హైదరాబాద్‌లో జర్మనీ కాన్సుల్ అమితా దేశాయ్, బవేరియా ఆర్థిక శాఖ ఈడీ ఉల్రికే హాఫ్‌మన్, బవేరియా ఇండియా కార్యాలయ ఈడీ జాన్ కొట్టాయిల్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Sheikh Hasina | డిసెంబర్లో స్వదేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హసీనా కీలక ప్రకటన
- ●ECI SIR | ‘సర్’ డిజిటలైజేషన్ వేగవంతం చేయండి
- ●Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
- ●Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
- ●Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..

CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Sheikh Hasina | డిసెంబర్లో స్వదేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హసీనా కీలక ప్రకటన

ECI SIR | ‘సర్’ డిజిటలైజేషన్ వేగవంతం చేయండి

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్



