Stock Markets | అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు..
Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కోసం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పాజిటివ్ సెంటిమెంట్‌తో వ్యవహరించారు. దీంతో సోమవారం అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగగా, దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం పాజిటివ్‌గానే ముగిశాయి.
Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కోసం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పాజిటివ్ సెంటిమెంట్‌తో వ్యవహరించారు. దీంతో సోమవారం అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగగా, దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం పాజిటివ్‌గానే ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ50 ఒక్కోటి 0.35 శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 291.17 పాయింట్లు (0.38 శాతం) పెరిగి 77,094.07 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 89.90 పాయింట్లు (0.37 శాతం) పెరిగి 24,102.90 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్ల సూచీలు సైతం లాభాల్లోనే ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో ఆశాజనక స్థాయిలో లాభాలు నమోదయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.34, 0.60 శాతం లాభపడ్డాయి. మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్‌గా పాజిటివ్‌గా నిలిచినప్పటికీ ప్రారంభంలో వచ్చిన లాభాలను సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి. ఇంట్రా డే గరిష్టాన్ని తాకి తరువాత ప్రారంభ స్థాయికి వచ్చి స్థిరపడ్డాయి. ఇక సోమవారం వచ్చిన పెరుగుదలతో మదుపర్ల సంపద ఒక్క రోజులోనే రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో నమోదై ఉన్న స్టాక్స్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ.477 లక్షల కోట్ల నుంచి రూ.480 లక్షల కోట్లకు పెరిగింది.
లాభాల్లో ఆసియా మార్కెట్లు..
అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊతమిచ్చాయి. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో పురోగతి చోటు చేసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా కీలక చర్చలు జరగ్గా అనేక అంశాలపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో మార్కెట్లలో ర్యాలీ చోటు చేసుకుంది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ మొత్తంగా సెంటిమెంట్ పాజిటివ్‌గానే నిలిచింది. జపాన్ నిక్కీ225 సూచీ 1321 పాయింట్లు ఎగబాకగా, దక్షిణ కొరియా కోస్పి సూచీ 62 పాయింట్ల మేర లాభపడింది. షాంగై కంపోజిట్ 72 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. హాంగ్ సెంగ్ సూచీ 156 పాయింట్లు నష్టపోయింది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్200 సూచీ స్వల్ప లాభాలతో ముగిసింది.
తగ్గిన చమురు ధరలు, పతనమైన రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గడం కూడా దేశీయ సూచీలను ప్రభావిం చేసింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.66 శాతం మేర పతనమై బ్యారెల్‌కు 78 డాలర్ల వద్ద నిలవగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.71 శాతం తగ్గి బ్యారెల్‌కు 75 డాలర్ల వల్ల స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్‌లో మాత్రం రూపాయి బలహీనతను ప్రదర్శించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 37 పైసలు తగ్గిన రూపాయి 94.68 వద్ద నిలిచింది. అయితే బంగారం ధరలు తగ్గడం వల్లే డాలర్ బలం పెరిగి రూపాయి బలహీనతను ప్రదర్శించిందని నిపుణులు చెబుతున్నారు. బంగారం విలువ పెరిగితే పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
తాజావార్తలు
- ●Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది
- ●Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!
- ●Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...
- ●Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ
- ●Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం
- ●India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: 'బ్రహ్మోస్', 'ఆకాశ్ తీర్' కోసం ముమ్మర చర్చలు

Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది

Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!

Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...

Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ







