Stock Markets | సెన్సెక్స్, నిఫ్టీ జోష్.. రిలయన్స్‌తో మార్కెట్‌లకు భారీ ఊరట..
Stock Markets | అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి కనిపించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు వచ్చాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ అర శాతానికి పైగా లాభపడ్డాయి.
Stock Markets | అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి కనిపించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు వచ్చాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ అర శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ 0.5 శాతం పెరిగి 24,129 స్థాయికి చేరుకోగా, సెన్సెక్స్ 0.51 శాతం లాభంతో 77,190.36 వద్ద ట్రేడైంది. మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోళ్లు కీలకంగా నిలిచాయి. నిఫ్టీలో అత్యధిక లాభాలు నమోదు చేసిన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉండగా, కంపెనీ షేర్ ధర 2.5 శాతం వరకు ఎగిసింది. సూచీలో భారీ వెయిటేజ్ కలిగిన ఈ స్టాక్ పెరుగుదల మార్కెట్‌కు బలమైన మద్దతునిచ్చింది.
తగ్గిన చమురు ధరలు..
అమెరికా-ఇరాన్ చర్చలపై వచ్చిన సానుకూల వార్తలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. ఖతార్, పాకిస్థాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన తొలి విడత చర్చలు విజయవంతంగా ముగిశాయి. తుది ఒప్పందాన్ని 60 రోజుల్లో పూర్తి చేసే రోడ్‌మ్యాప్‌పై పురోగతి సాధించినట్లు వెల్లడించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మళ్లీ దాడుల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నప్పటికీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరానియన్ అధికారులతో మధ్యంతర శాంతి ఒప్పందం కింద చర్చలు జరపడం సానుకూల సంకేతంగా మారింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడం కూడా భారత మార్కెట్‌లకు ఊరటనిచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.3 శాతం పడిపోయి బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే దిగువన కొనసాగింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది అనుకూల పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ కాస్త తగ్గింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు తగ్గి 94.4 వద్ద ట్రేడైంది.
సంబంధిత వార్తలు

Stock Markets | జూన్ 26న స్టాక్ మార్కెట్‌లకు సెలవు.. వరుసగా మూడు రోజులు ట్రేడింగ్‌కు బ్రేక్..
జూన్ 20, 2026

Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచర్ హెచ్చరికలతో ఐటీ షేర్లు ఢమాల్..
జూన్ 19, 2026

Stock Markets | ఐటీ షేర్లు భారీగా పతనం.. తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు
- ●Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
- ●DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
- ●IPO | ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..

Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు

Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు

DTO | వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..



