LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్‌జీ రైలు..
LNG Rail | దేశంలో తొలిసారిగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబర్మతి డివిజన్‌లో రూ.1,472 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
- పచ్చాజెండా ఊపి ప్రారంభించిన అమిత్ షా
- ఈ రైలు డీజిల్‌తో కూడా నడుస్తుంది
- డ్యూయల్ ఫ్యూయల్‌తో నడిచేలా ఏర్పాట్లు
LNG Rail | దేశంలో తొలిసారిగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబర్మతి డివిజన్‌లో రూ.1,472 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎల్‌ఎన్‌జీ–డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ విధానంతో ఈ రైలు నడవనుంది. సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలోని 1,400 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు పవర్ కార్లను ఈ విధానానికి అనుగుణంగా మార్చారు. వీటితో 8 కోచ్‌ల రైలును నడపనున్నారు.
డీజిల్‌తో పోలిస్తే సుమారు 40 శాతం వరకు ఇంధన వినియోగం తగ్గుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఇంధన వ్యయంతోపాటు కార్బన్‌డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్ ఉద్గారాలు తగ్గనున్నాయి. ప్రతి ఇంజిన్‌పై ఏటా సుమారు రూ.11.9 లక్షల వరకు, రెండు ఇంజిన్లపై రూ.23.9 లక్షల వరకు ఆదా అవుతుందని అంచనా. ఎల్‌ఎన్‌జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో డీజిల్‌తోనే రైలును నడిపే అవకాశం ఉండటంతో సుదూర ప్రయాణాల్లో ఇంధన లభ్యత సమస్యలతో అంతరాయాలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సబర్మతి డివిజన్‌లో చేపట్టిన ప్రాజెక్టులు పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతను మెరుగుపరుస్తాయని అన్నారు.
ఢిల్లీ నుంచి ప్రయాణించే సమయంలో సబర్మతి స్టేషన్‌లో పలుమార్లు ఆగినట్లు గుర్తుచేసుకున్న ఆయన.. చాలా కాలం తర్వాత స్టేషన్ రూపురేఖలు మారడం అభినందనీయమన్నారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, కనెక్టివిటీలో విస్తృత మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ముంబయి–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా సబర్మతిని మల్టీమోడల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. బుల్లెట్ రైలు, మెట్రో, బీఆర్‌టీఎస్, రైల్వే నెట్‌వర్క్‌లను అనుసంధానించేలా ఈ హబ్ రూపుదిద్దుకుంటోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ
- ●Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్
- ●Harish Rao | ఆరు నెలలు మొబైల్‌ను దూరం పెట్టండి.. అప్పుడే ఉద్యోగం సాధ్యం
- ●TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి
- ●Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ - దళపతి విజయ్, రష్మిక మందన్న తర్వాతి ప్లేస్‌లో...
- ●Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్లో 97 కేసులు నమోదు చేశాం

TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ

Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్

Harish Rao | ఆరు నెలలు మొబైల్‌ను దూరం పెట్టండి.. అప్పుడే ఉద్యోగం సాధ్యం

TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి






