Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..
Special Trains | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–దానాపూర్, చర్లపల్లి–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఒక్కో రైలు ట్రిప్పుల చొప్పున నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ వెల్లడించారు.
Special Trains | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–దానాపూర్, చర్లపల్లి–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఒక్కో రైలు ట్రిప్పుల చొప్పున నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ వెల్లడించారు. రైలు నంబర్ 07049 చర్లపల్లి–దానాపూర్ ప్రత్యేక రైలు ఆదివారాల్లో రాకపోకలు సాగిస్తుందని.. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే, 07050 నంబరు గల దానాపూర్–చర్లపల్లి ప్రత్యేక రైలు సోమవారాల్లో నడుస్తుందని, అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. ఈ రెండు రైళ్లు ఇరు మార్గాల్లో కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్ని, మైహర్, సత్నా, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగనున్నాయి.
చర్లపల్లి–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య..
07065 నంబరు గల చర్లపల్లి–ఎస్‌ఎంవీటీ బెంగళూరు ప్రత్యేక రైలు సోమవారాల్లో నడుస్తుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 సేవలు అందిస్తుంది. 07066 నంబరు గల ఎస్‌ఎంవీటీ బెంగళూరు–చర్లపల్లి ప్రత్యేక రైలు మంగళవారాల్లో అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 1 రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండు సర్వీసులు రెండు మార్గాల్లో సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సేదం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక స్టేషన్లలో ఆగనున్నాయి. రాబోయే దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bullet Train Steel Bridge Maharashtra | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో చారిత్రక ఘట్టం: మహారాష్ట్రలో తొలి స్టీల్ బ్రిడ్జ్.. 1300 కి.మీ ప్రయాణించి వచ్చిన భారీ వంతెన
- ●Konda Surekha | మీకు మొగోళ్లవసరంలే.. ఆడోళ్లతోనే చిత్తు చిత్తు కొట్టిస్తా
- ●Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?
- ●Mutual Funds | 3 ఏళ్లుగా ఎస్ఐపీలో నష్టాలు.. కొనసాగించాలా, తీసేయాలా..?
- ●Indian Oil Packaged Drinking Water | ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఆయిల్ సొంత 'వాటర్' : అందుబాటులోకి ప్యాకేజ్డ్ తాగునీరు
- ●INDIA bloc meeting | రేపు ఇండీ కూటమి కీలక భేటీ.. ఆప్, డీఎంకే దూరం

Bullet Train Steel Bridge Maharashtra | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో చారిత్రక ఘట్టం: మహారాష్ట్రలో తొలి స్టీల్ బ్రిడ్జ్.. 1300 కి.మీ ప్రయాణించి వచ్చిన భారీ వంతెన

Konda Surekha | మీకు మొగోళ్లవసరంలే.. ఆడోళ్లతోనే చిత్తు చిత్తు కొట్టిస్తా

Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?

Mutual Funds | 3 ఏళ్లుగా ఎస్ఐపీలో నష్టాలు.. కొనసాగించాలా, తీసేయాలా..?





