త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఆరు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

Trains Cancelled | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే పరిధిలో చేపడుతున్న నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డిసెంబర్‌లో ఆయా రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ మేర‌కు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

P

Telangana | Published On Sep 26, 2026, 5.21 pm IST

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఆరు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..
Advertisement

Trains Cancelled | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే పరిధిలో చేపడుతున్న నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డిసెంబర్‌లో ఆయా రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ మేర‌కు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌–రక్సౌల్‌ మధ్య నడిచే 17005 నంబర్‌ రైలు డిసెంబర్‌ 10న, రక్సౌల్‌–హైదరాబాద్‌ 17006 నంబర్‌ రైలు డిసెంబర్‌ 13న రద్దు కానున్నాయి. అలాగే, తిరుపతి–రక్సౌల్‌ మధ్య నడిచే 17433 నంబర్‌ రైలు డిసెంబర్‌ 7, 14 తేదీల్లో, రక్సౌల్‌–తిరుపతి 17434 నంబర్‌ రైలు డిసెంబర్‌ 10, 17 తేదీల్లో రద్దు చేయనున్నారు. ఇక వాస్కో డ గామా–జసిదిహ్‌ మధ్య నడిచే 17321 నంబర్‌ రైలు డిసెంబర్‌ 11న, జసిదిహ్‌–వాస్కో డ గామా 17322 నంబర్‌ రైలు డిసెంబర్‌ 14న రద్దు కానున్నాయి. నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా తేదీల్లో ప్రయాణాలకు టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు రైలు స్టేట‌స్ చెక్ చేసుకోవాల‌ని అధికారులు సూచించారు. ఈ మేర‌కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement