త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Post Payments Bank | పోస్టాఫీస్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా అందుబాటులో ఉన్న సేవింగ్స్ ఖాతా.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

India Post Payments Bank | ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (ఎస్‌హెచ్‌జీలు) కోసం ప్రత్యేకంగా కొత్త ఎస్‌హెచ్‌జీ సేవింగ్స్ అకౌంట్ ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

S

Business | Published On Jul 18, 2026, 5.00 pm IST

India Post Payments Bank | పోస్టాఫీస్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా అందుబాటులో ఉన్న సేవింగ్స్ ఖాతా.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..
Advertisement

India Post Payments Bank | ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (ఎస్‌హెచ్‌జీలు) కోసం ప్రత్యేకంగా కొత్త ఎస్‌హెచ్‌జీ సేవింగ్స్ అకౌంట్ ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమగ్రతను పెంచడం, మహిళల ఆర్థిక సాధికారతకు ఊతమివ్వడం, చిన్న పొదుపులను ప్రోత్సహించడమే ఈ ఖాతా ప్రధాన లక్ష్యమని సంస్థ తెలిపింది. ఈ కొత్త సేవింగ్స్ అకౌంట్ ద్వారా గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలకు సులభమైన, ఎలాంటి అదనపు ఖర్చులు లేని బ్యాంకింగ్ సేవలను అందించడంతోపాటు, పొదుపులను సమర్థవంతంగా నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కార్య‌క్ర‌మంలో నాబార్డ్ వంటి సంస్థల మద్దతు కూడా ఉంది. అయితే దీని గురించి చాలా మందికి ఇంకా అవ‌గాహ‌న లేద‌ని, ఈ ఖాతాల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

జీరో బ్యాలెన్స్, జీరో ఛార్జీలు..

ఈ కొత్త ఎస్‌హెచ్‌జీ సేవింగ్స్ అకౌంట్ ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందిస్తుంది. ఇండియా పోస్ట్ విస్తృత పోస్టల్ నెట్‌వర్క్‌తోపాటు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ విధానాన్ని వినియోగించి, చివరి గ్రామం వరకు బ్యాంకింగ్ సేవలు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఖాతాలో భాగంగా జీరో బ్యాలెన్స్‌, జీరో ఛార్జీలు అత్యంత ఆకర్షణీయమైన అంశాలుగా ఉన్నాయి. ఖాతా నిర్వహణకు కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. బ్యాలెన్స్ లేకపోయినా ఎలాంటి జరిమానాలు విధించరు. పోస్టాఫీసులు, గ్రామీణ డాక్ సేవక్‌ల సహాయంతో పూర్తిగా డిజిటల్ విధానంలో సులభంగా ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు భ‌ద్ర ప‌రుచుకోవ‌చ్చు. సేవింగ్స్ వడ్డీ రేట్ల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేస్తారు. నగదు డిపాజిట్, నగదు ఉపసంహరణలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ప్రతి నెల ఒక ఉచిత ఫిజికల్ అకౌంట్ స్టేట్‌మెంట్ అందిస్తారు. ఖాతా మూసివేతపై కూడా ఎలాంటి రుసుము ఉండదు. క్యూ ఆర్ కార్డు జారీకి కూడా ఛార్జీల‌ను వసూలు చేయరు.

గ్రామీణ‌, సెమీ అర్బన్ మ‌హిళ‌ల‌కు..

ఈ సేవింగ్స్ అకౌంట్ ముఖ్యంగా సూక్ష్మ వ్యాపారాలు, జీవనోపాధి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహిళా సంఘాల ఆర్థిక సాధికారతను పెంచేందుకు ప‌నిచేస్తుంది. కనీస బ్యాలెన్స్ నిబంధనలు వంటి సంప్రదాయ బ్యాంకింగ్ అడ్డంకులను తొలగించడం ద్వారా మరిన్ని ఎస్‌హెచ్‌జీలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని ఐపీపీబీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. త్రైమాసిక వడ్డీ చెల్లింపులు, రూ.2 లక్షల వరకు బ్యాలెన్స్ పరిమితి వంటి సౌకర్యాలు మహిళా సంఘాల పొదుపులకు భద్రత, పారదర్శకత, సౌలభ్యాన్ని కల్పిస్తాయి. ఐపీపీబీ డిజిటల్-ఫిజికల్ హైబ్రిడ్ మోడల్ ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చేర‌వేస్తోంది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది.

Advertisement
Advertisement