CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షలు మంది మహిళలున్నారని, వారికి వడ్డీ లేని రూ.అరవై వేల కోట్ల రుణాలను అందించామని, వాటి వడ్డీలను ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.
CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షలు మంది మహిళలున్నారని, వారికి వడ్డీ లేని రూ.అరవై వేల కోట్ల రుణాలను అందించామని, వాటి వడ్డీలను ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. మహిళా సంఘాలు 1000 బస్సులు కొనుగోలు చేశాయని, పునరుత్పాదక ఇంధన రంగంలోకి కూడా మహిళా సంఘాలు వచ్చాయని అన్నారు. వారికి పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు ఇచ్చామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ సంస్థ వద్ద మహిళా సంఘాల సభ్యులు క్యాంటీన్లు నడుపుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన మహిళా సంఘాలకు అప్పగించామని పేర్కొన్నారు.
గుజరాత్‌లో బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు..
తెలంగాణ రాష్ట్రం ఆకర్షించినట్లుగా గుజరాత్ పెట్టుబడులను ఆకర్షించడం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ బలవంతంగా గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. గత 20 ఏళ్ల నుంచి ఒకే ఒక్క బ్రాండ్ అంబాసిడర్ అక్కడ పని చేస్తున్నారని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము పొరుగు రాష్ట్రాలతో పోటీపడడం లేదు.. ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని చెప్పారు. తాము చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీతో పోటీపడుతున్నామని అన్నారు. నా నినాదం చైనా+1.. నేను 15 ఏళ్ల క్రితమే చైనా వెళ్లా.. నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇబ్బంది పడను.. నేను సాగునీటి ప్రాజెక్టు దగ్గరకు వెళితే అసిస్టెంట్ ఇంజినీర్ దగ్గర నుంచి తెలుసుకోవడానికి మొహమాట పడను..ఎందుకంటే ఆయనకే అసలైన సమస్య తెలుసు.. దానిని ఎలా పరిష్కరించాలో తెలుసు. త్వరలోనే నేను చైనా సందర్శిస్తా. నేను నేర్చుకుంటా.. హార్వర్డ్‌లో పది రోజులు కోర్సు చేశా.. చైనాను సందర్శించి ఉత్తమమైన పద్ధతులను తెలుసుకుంటా..అని రేవంత్ అన్నారు.
జర్నలిస్టులు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తా
పదిహేడేళ్లు ప్రతిపక్షంలో ఉండి చాలా తెలుసుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడానని, అందుకే తనను తప్పుదోవ పట్టించలేరని అన్నారు. చిన్న రైతు, నిరక్షరాస్యులు సైతం తమ దగ్గర ఉన్న సమాచారంతో తమ కామన్‌సెన్స్‌తో పరిష్కారం చూపుతారని, పరిపాలనలో కామన్ సెన్స్ అతి ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. కామన్‌సెన్స్ ఉపయోగించి సమస్యను అర్ధం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలతో అనుసంధానమైతేనే ఏదైనా అర్ధమవుతుందని, ప్రజలతో అనుసంధానం కావడమే ప్రజా జీవితంలో నిజమైన బలమని చెప్పారు. తాను ప్రతి పది రోజులకు ప్రెస్‌మీట్ నిర్వహించి, జర్నలిస్టులు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తానన్నారు. కేసీఆర్ మీడియా ప్రతినిధులను సైతం తాను అనుమతిస్తానని పేర్కొన్నారు. ఎంత లేటైనా జర్నలిస్టులతో మాట్లాడతానని చెప్పారు. జర్నలిస్టులతో వాదించనని, కానీ వ్యంగ్యంగా మాట్లాడతానని అన్నారు. వాళ్లు వ్యతిరేకంగా రాసినా పట్టించుకోనని, అందులో విషయం ఉంటే అధికారులతో మాట్లాడతానని, మీడియాను బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తానని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
జులై 24, 2026

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
జులై 24, 2026

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
జులై 24, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు



