IMS | ముగింపు దశకు ఇందిరా మహిళా శక్తి భవనాలు.. త్వరలోనే ప్రారంభించనున్న సీఎం
IMS | రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, గ్రామీణ మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి, శిక్షణ, వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవనాల నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
IMS | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, గ్రామీణ మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి, శిక్షణ, వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవనాల నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనాలను ప్రారంభించేందుకు మంత్రి
సీతక్క ఆదేశాలతో తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఒకే వేదికపై శిక్షణ, మార్కెటింగ్..
మహిళా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు జిల్లా స్థాయిలో శాశ్వత మౌలిక వసతులు కల్పించడంతో పాటు, మహిళలకు అవసరమైన శిక్షణ, సమావేశాలు, వ్యాపారాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ వంటి కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించేలా ఈ భవనాలను రూపొందిస్తున్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ భవనాలు భవిష్యత్‌లో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రాలుగా మారనున్నాయి.

రూ. 110 కోట్లతో 22 భవనాలు..
రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో భవనం సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.110 కోట్లు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

ఈ భవనాలు మహిళా సంఘాల ఆస్తులు
ఈ భవనాలను కేవలం కార్యాలయాలుగా కాకుండా మహిళా సంఘాలకు చెందిన ఆస్తులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయా జిల్లాల జల్లా సమాఖ్యలు వీటిని సొంతంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు అనుగుణంగా భవనాల వినియోగం, నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు.
మహిళా సాధికారతకు శాశ్వత చిరునామా
జిల్లా స్థాయిలో నిర్మిస్తున్న ఐఎంఎస్ భవనాలు మహిళా సంఘాల కార్యకలాపాలకు శాశ్వత చిరునామాగా మారడంతో పాటు, మహిళా సాధికారతకు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని మంత్రి శ్రీమతి సీతక్క అన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే సీఎం చేతుల మీదుగా వీటిని ప్రారంభించి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే
- ●Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయతలతోనే అవార్డులు ఇస్తున్నాం
- ●Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్

Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే



