త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amul Franchise | రూ.2 లక్షలతో అమూల్ ఫ్రాంచైజీ..ఎంత ఆదాయం వ‌స్తుంది..?

Amul Franchise | తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అమూల్ ఫ్రాంచైజీ ఒక అవకాశంగా నిలుస్తోంది. సుమారు రూ.2 లక్షల పెట్టుబడితో అవుట్‌లెట్ ఏర్పాటు చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఏడాదికి రూ.లక్ష నికర ఆదాయం వస్తుందన్న అంచనాకు వ్యాపార నిర్వహణ ఖర్చులు, అమ్మకాలు, ఉత్పత్తుల మార్జిన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

S

Business | Published On Nov 21, 2026, 4.10 pm IST

Amul Franchise | రూ.2 లక్షలతో అమూల్ ఫ్రాంచైజీ..ఎంత ఆదాయం వ‌స్తుంది..?
Advertisement

Amul Franchise | తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అమూల్ ఫ్రాంచైజీ ఒక అవకాశంగా నిలుస్తోంది. సుమారు రూ.2 లక్షల పెట్టుబడితో అవుట్‌లెట్ ఏర్పాటు చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఏడాదికి రూ.లక్ష నికర ఆదాయం వస్తుందన్న అంచనాకు వ్యాపార నిర్వహణ ఖర్చులు, అమ్మకాలు, ఉత్పత్తుల మార్జిన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అమూల్ ఫ్రాంచైజీ అవ‌కాశ‌మా..?

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న ఔత్సాహికులకు అమూల్ ఫ్రాంచైజీ మంచి అవకాశంగా మారుతుంనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ కొనుగోలుకు ఖర్చు చేసే సుమారు రూ.2 లక్షల మొత్తాన్ని అమూల్ ఫ్రాంచైజీపై పెట్టుబడిగా పెడితే ఏడాదికి దాదాపు రూ.లక్ష ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదని, అమూల్ సంస్థ ఫ్రాంచైజీ యజమానుల నుంచి రాయల్టీ వసూలు చేయదని, లాభాల్లో వాటా తీసుకోదని వీడియోలో వివరించారు. అయితే నష్టాలు వచ్చే అవకాశమే లేదని, ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదని చేసిన ప్రచారాన్ని పూర్తిగా నమ్మే ముందు వాస్తవ పరిస్థితులను పరిశీలించడం అవసరం.

రూ.2 లక్షల పెట్టుబడిలో ఏముంటుంది?

అమూల్ గతంలో వెల్లడించిన ఫ్రాంచైజీ మార్గదర్శకాల ప్రకారం, సుమారు రూ.2 లక్షల పెట్టుబడిలో రూ.లక్ష దుకాణం పునరుద్ధరణ పనులకు, రూ.70 వేలు అవసరమైన పరికరాల కొనుగోలుకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఖర్చులు ఉంటాయి. ఇందులో రూ.25 వేల బ్రాండ్ సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి చెల్లించదగినది. అయితే దుకాణం కోసం స్థలం కొనుగోలు లేదా అద్దె ఖర్చులు ఈ పెట్టుబడిలో చేర్చలేదు. ప్రారంభంలో సరుకులు కొనుగోలు చేయడానికి, విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించడానికి అదనపు వర్కింగ్ క్యాపిటల్ కూడా అవసరం. అమూల్ సంస్థ మిల్క్ బూత్‌లు, సాధారణ పార్లర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటి వివిధ రకాల ఫ్రాంచైజీలను అందిస్తోంది. వీటికి అవసరమైన స్థలం సాధారణంగా 100 నుంచి 400 చదరపు అడుగుల వరకు ఉంటుంది.

అమ్మకాలు, లాభాలపై స్పష్టత అవసరం..

అమూల్ ఫ్రాంచైజీ ద్వారా నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అమ్మకాలు సాధ్యమవుతాయని ప్రచారంలో పేర్కొంటున్నారు. అయితే ఈ అమ్మకాలపై వచ్చే లాభం ఉత్పత్తులను బట్టి మారుతుంది. అమూల్ గతంలో వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం.. ప్యాకెట్ పాల విక్రయాలపై సుమారు 2.5 శాతం, పాల ఉత్పత్తులపై 10 శాతం, ఐస్‌క్రీమ్ విక్రయాలపై 20 శాతం మార్జిన్ లభిస్తుంది. ఈ మార్జిన్ల నుంచే దుకాణం అద్దె, సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులను భరించాలి. అందువల్ల రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల టర్నోవర్ వచ్చినంత మాత్రాన రూ.లక్ష నికర లాభం వస్తుందని చెప్పలేం. ఫ్రాంచైజీ యజమానులు రాయల్టీ లేదా ఆదాయంలో వాటా చెల్లించాల్సిన అవసరం లేదని అమూల్ గతంలో స్పష్టం చేసింది.

అయితే సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో ఒప్పందం, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యాక రూ.25 వేలు వసూలు చేస్తారని, ఏడాది తర్వాత ఆటోమేటిక్‌గా తిరిగి చెల్లిస్తారనే హామీ మాత్రం లేదని సంస్థ పబ్లిక్ అడ్వైజరీ పేర్కొంటోంది. కాబట్టి బుల్లెట్ మోటార్‌సైకిల్ కొనుగోలు చేయాలా? లేక అమూల్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టాలా? అనే నిర్ణయం తీసుకునే ముందు స్థానిక మార్కెట్ డిమాండ్, అద్దె, నిర్వహణ ఖర్చులు, ఆశించిన అమ్మకాలపై లెక్కలు వేసుకోవడం మంచిది.

 

View this post on Instagram

 

A post shared by Shivam Rajput (@businessidea_841)

Advertisement
Advertisement