త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AgriGold | అగ్రిగోల్డ్‌ బాధితులకు బిగ్ రిలీఫ్‌.. బాండ్ల వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల

AgriGold | అగ్రిగోల్డ్ బాండ్ల కేసులో తెలంగాణ సీఐడీ కీలక ప్రకటన చేసింది. డిపాజిటర్ల బాండ్‌ పత్రాల వెరిఫికేషన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్‌ నిర్వహించే తేదీలు, కేంద్రాలు, బాధ్యతలు నిర్వర్తించే అధికారుల వివరాలను ప్రకటించింది. సుమారు రూ.447 కోట్ల కుంభకోణానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1.65 లక్షల మంది బాధితులను గుర్తించిన నేపథ్యంలో వారి డిపాజిట్‌ బాండ్లు, ఇతర ఆధారాల పరిశీలనకు ఈ ప్రక్రియ చేపడుతోంది.

P

Telangana | Published On Nov 21, 2026, 4.56 pm IST

AgriGold | అగ్రిగోల్డ్‌ బాధితులకు బిగ్ రిలీఫ్‌.. బాండ్ల వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల
Advertisement
  • జిల్లాలు, మండలాల వారీగా తేదీలు, కేంద్రాల ఖరారు
  • రూ.447 కోట్ల కుంభకోణంలో 1.65 లక్షల మంది బాధితుల గుర్తింపు
  • అవసరమైన పత్రాలతో నిర్ణీత తేదీల్లో హాజరుకావాలని సీఐడీ సూచన

AgriGold | అగ్రిగోల్డ్ బాండ్ల కేసులో తెలంగాణ సీఐడీ కీలక ప్రకటన చేసింది. డిపాజిటర్ల బాండ్‌ పత్రాల వెరిఫికేషన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్‌ నిర్వహించే తేదీలు, కేంద్రాలు, బాధ్యతలు నిర్వర్తించే అధికారుల వివరాలను ప్రకటించింది. సుమారు రూ.447 కోట్ల కుంభకోణానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1.65 లక్షల మంది బాధితులను గుర్తించిన నేపథ్యంలో వారి డిపాజిట్‌ బాండ్లు, ఇతర ఆధారాల పరిశీలనకు ఈ ప్రక్రియ చేపడుతోంది. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. ఈ కేసులో బాధితులుగా గుర్తించిన సుమారు 1.65 లక్షల మందికి సంబంధించిన డిపాజిట్‌ బాండ్‌ పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించేందుకు ప్రత్యేక వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇందులో భాగంగా జిల్లాలు, మండలాల వారీగా సమగ్ర షెడ్యూల్‌ను సిద్ధం చేసి విడుదల చేసింది. ఇదిలా ఉండ‌గా.. వెరిఫికేషన్‌కు హాజరయ్యే బాధితులు తమ వద్ద ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ బాండ్‌ పత్రాలు, సంబంధిత రశీదులు, గుర్తింపు కార్డులు, ఇతర అవసరమైన ఆధారాలను తప్పనిసరిగా తీసుకురావాలని సీఐడీ సూచించింది. తమకు కేటాయించిన తేదీ, వెరిఫికేషన్‌ కేంద్రం వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని తెలిపింది. నిర్ణీత తేదీన సంబంధిత అధికారుల ఎదుట హాజరై పత్రాల పరిశీలన పూర్తి చేయించుకోవాలని కోరింది. బాధితులు తమకు కేటాయించిన తేదీల్లోనే సంబంధిత కేంద్రాలకు చేరుకుని వెరిఫికేషన్‌లో పాల్గొనాలని సూచించింది.

Advertisement
Advertisement