త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deeksha Diwas | దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం

Deeksha Diwas | తెలంగాణ అమరుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Nov 21, 2026, 5.12 pm IST

Deeksha Diwas | దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం
Advertisement

బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు

Deeksha Diwas | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ అమరుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ‌నివారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులతో జూమ్ ద్వారా అంతర్జాతీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు.

కేటీఆర్ పిలుపు మేరకు దీక్షా దివస్ సందర్భంగా సభలు, సమావేశాలతో పాటు రక్తదాన శిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు, వీడియో సందేశాలను ప్రచారం చేయాలని, తెలంగాణ ప్రవాసులను భాగస్వాములను చేయాలని కోరారు. అలాగే, వివిధ దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం

కేసీఆర్ నాయకత్వంలో 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాబోతోందని, తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగురవేయబోతోందని మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులకు పార్టీ నాయకత్వాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంతో రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి దేశాల పర్యటనలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులందరూ ఐక్యంగా పనిచేస్తూ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాలి.. అమరుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలవాలి అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement