Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ
చంద్రబాబుకు గురు దక్షిణగా మన నీళ్లను అప్పగిస్తున్నరు
నాగార్జున సాగర్ పై ఏపీ అక్రమ ప్రాజెక్టును వారం రోజుల్లోగా ఆపాలి
లేదంటే వేలాది మందితో సాగర్ డ్యామ్‌ను ముట్టడిస్తాం
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక
Kalvakuntla Kavitha | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడున్నది అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. చంద్రబాబును పిలిచి ప్రజాభవన్ లో కాళ్లు కడిగి గురుదక్షిణగా మన నీళ్లను అప్పగించారు.. అందుకే ఏపీ పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టింది అని ఆరోపించారు. హైదరాబాద్‌లో శనివారం కవిత మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రొటోకాల్స్‌ను విస్మరించి పని చేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం డిమాండ్ చేయకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో అన్ అఫీషియల్ మీటింగ్‌కు వెళ్లి పోలవరం బనకచర్లకు ఒప్పుకొని వచ్చారు. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తాగునీటి పేరుతో నాగార్జున సాగర్ నీటికి గండికొడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల జలదోపిడీ ఎంతలా చేసిందో మనకు తెలుసు. తాగునీరు పేరుతో శ్రీశైలం ప్రాజెక్టుపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి ఇప్పుడు మొత్తం రిజర్వాయర్‌నే మళ్లించుకుపోతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్‌పై ఏపీ కన్ను పడ్డది.. ఇప్పటికే తాగునీటి కోసమని 2.8 టీఎంసీలను తీసుకుంటున్న ఏపీ ఇప్పుడు లిఫ్ట్ పేరుతో మరో 1.8 టీఎంసీలను తరలిస్తామని చెప్తోంది. తాగునీటి పేరు చెప్పి ఏపీ ప్రాజెక్టులు మొదలు పెట్టి.. మొత్తం రిజర్వాయర్ నీటినే ఎత్తుకుపోవడం మనందరికి తెలుసు. ఏపీ ప్రభుత్వం 9 నెలలుగా అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలియలేదు అంటే ఎట్లా నమ్మాలి అని కవిత ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రే కాదు రాష్ట్ర హోం మంత్రి కూడా.. మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ తో ఈ ప్రాజెక్టు సమాచారం రాలేదా? ఇది సీఎం ఫెయిల్యూరా? రేవంత్ రెడ్డి సమ్మతితోనే ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టును నిర్మిస్తోంది. బీజేపీకి మన ఓట్లు.. సీట్లు కావాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అన్నింటిపై నోరు పారేసుకునే ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడటం లేదు. ఏపీలో బీజేపీకి టీడీపీతో పొత్తు ఉంటే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతారా? తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి ఏపీ అక్రమ ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేయాలి. ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌లో భాగంగా 50 శాతం నిధులు ఇవ్వడం దారుణం.. వెంటనే కేంద్రం సాయాన్ని కూడా నిలిపి వేయించేలా ఒత్తిడి చేయాలి. ఏపీ అక్రమ ప్రాజెక్టును ఆపాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలదే. వాళ్లకు వారం రోజులు టైం ఇస్తున్నాం.. ఆలోగా ఏపీ అక్రమంగా చేపట్టిన పల్నాడ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆపివేయించకుంటే.. తెలంగాణ వనరుల రక్షణ కోసం పుట్టిన తెలంగాణ రక్షణ సేన పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది మంది ప్రజలతో నాగార్జున సాగర్ డ్యాంను ముట్టడిస్తాం.. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నామని కవిత పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
- ●MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నా.. ప్రజల కోసం యుద్ధం చేస్తా
- ●IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..
- ●Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!
- ●PM Modi Gamcha Swirl Vaishali | ఓపెన్ వాహనంలో మోదీ 'గమ్చా' మేనియా.. గంగా నదిపై భారీ బ్రిడ్జికి 'నితీశ్ సేతు' పేరు
- ●Priyanka Chopra | "వారణాసి"కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డబ్బింగ్ - కండీషన్ పెట్టిన రాజమౌళి

AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నా.. ప్రజల కోసం యుద్ధం చేస్తా

IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..

Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!






