Personal Loan | పర్సనల్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా.. అయితే ఇలా చేయండి..
Personal Loan | ప్రస్తుత డిజిటల్ యుగంలో పర్సనల్ లోన్ పొందడం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం మాదిరిగా చాలా సులభంగా మారింది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ల కారణంగా ఇంట్లో నుంచే పర్సనల్ లోన్‌కు అప్లై చేయవచ్చు. తక్కువ డాక్యుమెంటేషన్‌తో వేగంగా ప్రాసెసింగ్ పూర్తవుతుంది.
Personal Loan | ప్రస్తుత డిజిటల్ యుగంలో పర్సనల్ లోన్ పొందడం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం మాదిరిగా చాలా సులభంగా మారింది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ల కారణంగా ఇంట్లో నుంచే పర్సనల్ లోన్‌కు అప్లై చేయవచ్చు. తక్కువ డాక్యుమెంటేషన్‌తో వేగంగా ప్రాసెసింగ్ పూర్తవుతుంది. సాధారణంగా క్రెడిట్ అసెస్‌మెంట్, అప్రూవల్ పూర్తయ్యాక 24 నుంచి 48 గంటల్లో ఫండ్స్ అకౌంట్‌లో జమ అవుతాయి. అయితే కొన్ని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కేవలం నిమిషాల వ్యవధిలోనే వ్యక్తిగత రుణాలను ఇస్తున్నాయి. కానీ ప్రతి సారి ప్రక్రియ అనుకున్న విధంగా జరగదు. అన్ని అప్లికేషన్లు అప్రూవ్ కావు. రిజెక్షన్ అనేది ఇంకా చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్యగా మారింది. లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే, దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అదే తప్పులు మళ్లీ చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
క్రెడిట్ స్కోర్, స్థిరంగా లేని ఆదాయం..
లోన్ అప్రూవల్ ముందు లెండర్లు పలు ఆర్థిక ప్రమాణాలను పరిశీలిస్తారు. అందులో ముఖ్యమైనది క్రెడిట్ స్కోర్. సాధారణంగా 700 పైగా స్కోర్ అనుకూలంగా భావిస్తారు. దీనికంటే తక్కువ ఉంటే రీపేమెంట్ సామర్థ్యంపై సందేహాలు వస్తాయి. డెట్-టు-ఇన్‌కమ్ రేషియో కూడా కీలకం. ఒక వ్యక్తి ఇప్పటికే అనేక లోన్లు చెల్లిస్తున్నట్లయితే, అతను ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నాడని లెండర్లు భావిస్తారు. అలాగే తక్కువ లేదా స్థిరంగా లేని ఆదాయం కూడా రిజెక్షన్‌కు దారితీస్తుంది. తరచూ ఉద్యోగాలు మారడం లేదా తక్కువ వర్క్ హిస్టరీ ఉండడం కూడా అర్హతను తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న డాక్యుమెంట్ పొరపాట్లు లేదా అసంపూర్ణ సమాచారం కూడా అప్లికేషన్‌ను ఆటోమేటిక్‌గా తిరస్కరించేలా చేస్తాయి.
మళ్లీ వెంటనే అప్లై వద్దు..
రిజెక్షన్ వచ్చిన వెంటనే మళ్లీ అప్లై చేయడం కంటే, ముందుగా కారణాన్ని తెలుసుకోవాలి. చాలా మంది లెండర్లు లోన్ అభ్యర్థనపై రిజెక్షన్ కారణాన్ని తెలియజేయరు. కానీ క్రెడిట్ రిపోర్ట్‌ను కూడా పరిశీలించడం అవసరం. తప్పుగా నమోదు చేసిన డిఫాల్ట్‌లు లేదా పాత సమాచారం స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇక మళ్లీ లోన్‌కు అప్లై చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను అనుసరించాలి. రిజెక్షన్ కారణాన్ని తెలుసుకుని దానిని సరిచేయాలి. క్రెడిట్ రిపోర్ట్‌ను ఆడిట్ చేసి పొరపాట్లను సవరించాలి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సమయానికి చెల్లించాలి. మిగిలిన అప్పులను తగ్గించి క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను నియంత్రించాలి. మళ్లీ అప్లై చేయడానికి కనీసం 3 నుంచి 6 నెలలు వేచి ఉండాలి. మరలా అప్లై చేసే సమయంలో బలమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న కో-అప్లికెంట్‌ను చేర్చడం మంచిది. దీంతో లోన్ అప్రూవల్ చాన్స్‌లు పెరుగుతాయి.
ఈ సూచనలను కూడా పాటించాలి..
రిజెక్షన్ వెంటనే మళ్లీ అప్లై చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌ను మరింత దెబ్బతీస్తుంది. ఒకేసారి అనేక లెండర్లకు అప్లై చేయడం వల్ల క్రెడిట్ హంగర్‌గా కనిపిస్తుంది. క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లను పట్టించుకోకపోవడం వల్ల తిరిగి రిజెక్షన్‌కు దారి తీస్తుంది. అన్ని ఆదాయ వనరులను వెల్లడించకపోతే అప్లికేషన్ బలహీనమవుతుంది. సామర్థ్యానికి మించి లోన్ మొత్తాన్ని అడగడం కూడా సరికాదు. అధిక ఫిక్స్‌డ్ ఆబ్లిగేషన్ టు ఇన్‌కమ్ రేషియో (ఎఫ్‌వోఐఆర్) కారణంగా తిరస్కరణకు దారి తీస్తుంది. పర్సనల్ లోన్ పొందడం సులభమైన ప్రక్రియ అయినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక చాలా ముఖ్యం. రిజెక్షన్‌ను ఒక అవకాశంగా తీసుకుని ఆర్థిక స్థితిని మెరుగుపరచుకుంటే, భవిష్యత్తులో లోన్ అప్రూవల్ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






