ITR | ఐటీఆర్ రీఫండ్ తగ్గిందా? అసలు కారణాలివే.. ఇలా చెక్ చేసుకోండి..
ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసిన తర్వాత రీఫండ్ క్లెయిమ్ చేస్తే, పోర్టల్‌లో కనిపించే మొత్తం చివరకు అదే వస్తుందని అనుకోవడం సరైంది కాదు. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత మీ ఖాతాలో జమయ్యే రీఫండ్ మొత్తం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసిన తర్వాత రీఫండ్ క్లెయిమ్ చేస్తే, పోర్టల్‌లో కనిపించే మొత్తం చివరకు అదే వస్తుందని అనుకోవడం సరైంది కాదు. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత మీ ఖాతాలో జమయ్యే రీఫండ్ మొత్తం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందుకు కారణం పోర్టల్‌లో కనిపించే రీఫండ్ మొత్తం కేవలం అంచనా మాత్రమే. మీరు చెల్లించిన పన్ను, క్లెయిమ్ చేసిన డిడక్షన్ల ఆధారంగా ఈ అంచనాను చూపిస్తారు. ఐటీఆర్ సమర్పించిన తర్వాత, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) రిటర్న్‌ను పరిశీలిస్తుంది. ఈ సమయంలో మీ ఐటీఆర్‌లోని వివరాలను శాఖ వద్ద ఉన్న రికార్డులతో పోల్చి చూస్తుంది. ఇందులో ఫామ్ 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్), అలాగే పన్ను చెల్లింపు రికార్డులు ఉంటాయి.
కారణాలేంటి..?
అదే విధంగా, మీరు క్లెయిమ్ చేసిన ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) వివరాలు, యజమానులు, బ్యాంకులు, ఇతర టీడీఎస్ డిడక్టర్లు సమర్పించిన వివరాలతో సరిపోతున్నాయా లేదా అనే అంశాన్ని కూడా శాఖ ధ్రువీకరిస్తుంది. మీ ఐటీఆర్‌లో ఏవైనా పొరపాట్లు లేదా వివరాల్లో వ్యత్యాసాలు గుర్తిస్తే, ఆదాయపు పన్ను శాఖ అవసరమైన సవరణలు చేస్తుంది. దీంతో మీకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ తగ్గే అవకాశం ఉంటుంది. గణనలో జరిగిన తప్పులను సరిచేయడం, తప్పుగా క్లెయిమ్ చేసిన డిడక్షన్లను తొలగించడం, అధికారిక రికార్డులకు సరిపోని ట్యాక్స్ క్రెడిట్లను సవరించడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉంటాయి. క్లియర్‌ట్యాక్స్ వెబ్‌సైట్ ప్రకారం, ట్యాక్స్ క్రెడిట్ వివరాలు సరిపోకపోవడం రీఫండ్ తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఐటీఆర్‌లో క్లెయిమ్ చేసిన టీడీఎస్ మొత్తం, ఫామ్ 26ఏఎస్‌లో చూపిన టీడీఎస్ కంటే ఎక్కువగా ఉంటే, అదనపు మొత్తాన్ని శాఖ తిరస్కరించే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయ వివరాలను తప్పుగా నమోదు చేయడం లేదా పాత ట్యాక్స్ బకాయిలు ఉండడం వల్ల కూడా రీఫండ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. పాత బకాయిలకు వ్యతిరేకంగా రీఫండ్‌ను సర్దుబాటు చేసే అధికారం శాఖకు ఉంటుంది.
ఏం చేయాలి..?
ఈ తరహా సమస్యలు రాకుండా ఉండాలంటే, ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఏఐఎస్, టీఐఎస్‌లో ఉన్న ఆదాయ వివరాలతో తమ సమాచారం సరిపోతుందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. రీఫండ్ అన్యాయంగా తగ్గిందని భావిస్తే, ముందుగా సెక్షన్ 143(1) కింద ఆదాయపు పన్ను శాఖ పంపే ఇంటిమేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ ఇంటిమేషన్ ను పన్ను చెల్లింపుదారుడి ఈ-మెయిల్‌కు పంఫిస్తారు. ఇందులో ఐటీఆర్‌లో పేర్కొన్న ఆదాయం, డిడక్షన్లు, ఇతర వివరాలను శాఖ పరిశీలించిన వివరాలతో పోల్చి చూపిస్తుంది. ఇంటిమేషన్ ను పరిశీలించిన తర్వాత కూడా తప్పు జరిగిందని భావిస్తే, ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయవచ్చు. అలాగే పాత ట్యాక్స్ బకాయిల కారణంగా రీఫండ్ సర్దుబాటు చేసి ఉంటే, అదే ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆ డిమాండ్‌కు సమాధానం ఇవ్వవచ్చు.
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి






