త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PSLV-C62 | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సి62.. ఇస్రో ఆధ్వ‌ర్యంలో అన్వేష మిష‌న్‌..

PSLV-C62 | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) సోమ‌వారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) సి62 రాకెట్‌ను ప్ర‌యోగించింది. దీని ద్వారా ఎర్త్ అబ్జర్వేష‌న్ శాటిలైట్ (ఈవోఎస్)తోపాటు మ‌రో 14 సాధార‌ణ శాటిలైట్ల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశపెట్టారు. 2026లో ఇస్రో చేప‌ట్టిన మొద‌టి మిష‌న్ ఇదే కాగా పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో ఇది 64వ ప్ర‌యోగం కావ‌డం విశేషం.

S

Science | Published On Jan 12, 2026, 10.55 am IST

PSLV-C62 | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సి62.. ఇస్రో ఆధ్వ‌ర్యంలో అన్వేష మిష‌న్‌..
Advertisement

PSLV-C62 | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) సోమ‌వారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) సి62 రాకెట్‌ను ప్ర‌యోగించింది. దీని ద్వారా ఎర్త్ అబ్జర్వేష‌న్ శాటిలైట్ (ఈవోఎస్)తోపాటు మ‌రో 14 సాధార‌ణ శాటిలైట్ల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశపెట్టారు. 2026లో ఇస్రో చేప‌ట్టిన మొద‌టి మిష‌న్ ఇదే కాగా పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో ఇది 64వ ప్ర‌యోగం కావ‌డం విశేషం. ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్ (ఈవోఎస్‌-ఎన్‌1)కు అన్వేష‌గా నామ‌క‌ర‌ణం చేసిన ఇస్రో దీన్ని భూమి నుంచి 100 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఉప‌గ్రహానికి గాను ఆదివారం నుంచే 22.5 గంట‌ల పాటు ఇస్రో కౌంట్ డౌన్ నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలోనే శ్రీ‌హ‌రికోట‌లో ఉన్న స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ నుంచి సోమ‌వారం పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ ద్వారా ఈవోఎస్‌-ఎన్‌1 ఉప‌గ్ర‌హాన్ని క‌క్ష్య‌లో ప్రవేశ‌పెట్టారు.

ఇస్రోకు చెందిన వాణిజ్య సంబంధ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ క్రమంలోనే దేశీయ ఉప‌గ్ర‌హాలతోపాటు ప‌లు అంత‌ర్జాతీయ ఉప్ర‌గ‌హాల‌ను కూడా ఈ మిష‌న్‌లో భాగంగా క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇక పీఎస్ఎల్వీ-సి62 రాకెట్‌ను సోమ‌వారం ఉద‌యం 10:18 గంట‌ల‌కు ప్ర‌యోగించాల‌ని ముందుగానే కౌంట్ డౌన్ నిర్వ‌హించ‌గా, ఈ రాకెట్ 260 ట‌న్నుల బ‌రువును నింగిలోకి మోసుకెళ్లింది. ఆదివారం మ‌ధ్యాహ్నం 12:48 గంట‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా మొత్తం 22 గంట‌ల 30 నిమిషాల పాటు కొన‌సాగింది. కచ్చితంగా అనుకున్న స‌మ‌యానికే రాకెట్‌ను ప్ర‌యోగించారు.

పీఎస్ఎల్‌వీ-సి62, ఈవోఎస్‌-ఎన్‌1 మిష‌న్‌లో భాగంగా ముందుగా క‌క్ష్య‌లో థాయ్‌లాండ్‌, యూకే దేశాలు సంయుక్తంగా నిర్మించిన ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌వేశ‌పెడ‌తారు. ఇందులోనే ఎర్త్ అబ్జర్వేష‌న్ శాటిలైట్ ఉంటుంది. ఆ త‌రువాత మిగిలిన 13 ఇత‌ర సాధార‌ణ ఉప‌గ్ర‌హాల‌ను ఒక్కొక్క‌టిగా క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెడ‌తారు. కాగా పీఎస్ఎల్‌వీ ఇప్ప‌టికే 63 మిష‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. అందులో చంద్ర‌యాన్‌-1, మార్స్ ఆర్బిట‌ర్ మిష‌న్ (ఎంవోఎం), ఆదిత్య‌-ఎల్‌1 వంటి ప్ర‌తిష్టాత్మ‌క మిష‌న్లు కూడా ఉన్నాయి. ఈవోఎస్‌-ఎన్‌1 ఉప‌గ్ర‌హం ద్వారా ప‌లు ముఖ్య‌మైన ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. ఈ ఉప‌గ్ర‌హాన్ని ర‌క్ష‌ణ రంగం, వ్య‌వ‌సాయం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌ కోసం ప్ర‌త్యేకంగా ఉప‌యోగించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement