త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన ఎస్‌బీఐ.. ఏటీఎం వినియోగ చార్జిలు పెంపు..

SBI | ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. ఏటీఎంల‌తోపాటు ఆటోమేటెడ్ డిపాజిట్ క‌మ్ విత్‌డ్రాయ‌ల్ మెషిన్ (ADWM) ట్రాన్సాక్ష‌న్ చార్జిల‌ను పెంచుతున్న‌ట్లు తెలియ‌జేసింది. ఏటీఎంల‌లో నిర్దేశించిన ప‌రిమితి క‌న్నా ఎక్కువ సార్లు నిర్వ‌హించే లావాదేవీల‌కు గాను ఈ చార్జిలను పెంచుతున్న‌ట్లు తెలిపింది.

S

Business | Published On Jan 12, 2026, 11.40 am IST

SBI | వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన ఎస్‌బీఐ.. ఏటీఎం వినియోగ చార్జిలు పెంపు..
Advertisement

SBI | ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. ఏటీఎంల‌తోపాటు ఆటోమేటెడ్ డిపాజిట్ క‌మ్ విత్‌డ్రాయ‌ల్ మెషిన్ (ADWM) ట్రాన్సాక్ష‌న్ చార్జిల‌ను పెంచుతున్న‌ట్లు తెలియ‌జేసింది. ఏటీఎంల‌లో నిర్దేశించిన ప‌రిమితి క‌న్నా ఎక్కువ సార్లు నిర్వ‌హించే లావాదేవీల‌కు గాను ఈ చార్జిలను పెంచుతున్న‌ట్లు తెలిపింది. పెంచిన చార్జిల‌ను గ‌త డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచే అమ‌లు చేస్తున్నామ‌ని ఎస్‌బీఐ తెలియ‌జేసింది. కాగా ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ప‌రిమితి ముగిసిన అనంత‌రం ఇత‌ర బ్యాంకుల‌కు చెందిన ఏటీఎంల‌లో నిర్వ‌హించే న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్ లావాదేవీల‌కు గాను ఒక్కో ట్రాన్సాక్ష‌న్‌కు చార్జిని రూ.23 వ‌ర‌కు పెంచిన‌ట్లు తెలిపారు. దీనికి జీఎస్‌టీ అద‌నంగా ఉంటుంది. గ‌తంలో ఈ చార్జి రూ.21గా ఉండేది.

అందుక‌నే చార్జిల పెంపు..

ప‌రిమితి ముగిసిన త‌రువాత నిర్వ‌హించే న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు కూడా చార్జిల‌ను పెంచిన‌ట్లు తెలిపారు. గ‌తంలో ఈ చార్జిలు ఒక్క ట్రాన్సాక్ష‌న్‌కు రూ.10 ఉండ‌గా ఇప్పుడు వీటిని రూ.11కు పెంచారు. ఈ చార్జిల‌కు జీఎస్టీ కూడా అద‌నంగా విధిస్తారు. న‌గ‌దు ర‌హిత లావాదేవీలు అంటే బ్యాలెన్స్ విచార‌ణ‌, మినీ స్టేట్‌మెంట్ వంటి ట్రాన్సాక్ష‌న్లుగా చెప్ప‌వచ్చు. అయితే ఏటీఎం సంబంధ సేవ‌లు, ఇంట‌ర్‌చేంజ్ ఫీజు, ఇత‌ర ఖ‌ర్చుల కార‌ణంగానే ఈ సేవ‌ల‌కు గాను చార్జిల‌ను పెంచుతున్న‌ట్లు ఎస్‌బీఐ తెలియ‌జేసింది. అయితే ఎస్‌బీఐలో ఉన్న సాధార‌ణ సేవింగ్స్ ఖాతాదారులు, శాల‌రీ అకౌంట్ హోల్డ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ చార్జిల పెంపు వ‌ర్తిస్తుంద‌ని, ఇత‌ర విభాగాల‌కు చెందిన అకౌంట్ల‌ను ఉప‌యోగించే ఖాతాదారుల‌పై ఎలాంటి చార్జిల‌ను విధించ‌లేద‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. సేవింగ్స్‌, శాల‌రీ అకౌంట్లు ఉన్న ఖాతాదారులు త‌మ‌కు విధించిన ప‌రిమితిని దాటి ఇత‌ర బ్యాంకుల‌కు చెందిన ఏటీఎంల‌లో చేప‌ట్టే లావాదేవీల‌కు మాత్ర‌మే ఈ చార్జిల పెంపు వ‌ర్తిస్తుంద‌ని ఎస్‌బీఐ తెలిపింది.

నెల‌కు 5 లావాదేవీలు ఉచితం..

ఇక సేవింగ్స్ ఖాతాదారుల‌కు ఎస్‌బీఐయేత‌ర ఏటీఎంల‌లో నెల‌కు 5 లావాదేవీల‌ను ఉచితంగా నిర్వ‌హించుకునేందుకు వీలుంద‌ని, ఆ ప‌రిమితిలో ఎలాంటి మార్పు లేద‌ని ఆ బ్యాంకు తెలిపింది. 5 ఉచిత ట్రాన్సాక్ష‌న్లు దాటితేనే చార్జిల‌ను విధిస్తామ‌ని తెలిపింది. న‌గ‌దు, న‌గ‌దు ర‌హిత లావాదేవీ ఏదైనా స‌రే ఒక ట్రాన్సాక్ష‌న్‌గా ప‌రిగ‌ణిస్తామ‌ని, క‌నుక ఏ ట్రాన్సాక్ష‌న్లు అయినా స‌రే ఎస్‌బీఐ కాకుండా ఇత‌ర బ్యాంకుల‌కు చెందిన ఏటీఎంల‌ను వాడితే నెల‌కు 5 లావాదేవీల వ‌ర‌కు మాత్ర‌మే ఉచితంగా అందిస్తామ‌ని, అందులో ఎలాంటి మార్పు లేద‌ని, ఆ పరిమితి దాటితేనే చార్జిలు ఉంటాయ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. ఇక శాల‌రీ ఖాతాల‌ను క‌లిగి ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్రం ఈ విష‌యంలో ఇంకాస్త మిన‌హాయింపును క‌ల్పించారు. వారికి 10 వ‌ర‌కు నెల‌వారి ఉచిత లావాదేవీల‌ను అందిస్తున్నారు. ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లో ఏ ట్రాన్సాక్ష‌న్ అయినా స‌రే 10 వ‌ర‌కే ఉచితంగా చేసుకునే వీలుంటుంది. ఆ ప‌రిమితి దాటితే చార్జిలు వ‌డ్డిస్తారు.

ఈ ఖాతాల‌కు వ‌ర్తించ‌వు..

కాగా ఎస్‌బీలో సేవింగ్స్‌, శాల‌రీ ఖాతాలు కాకుండా ఇత‌ర విభాగాల‌కు చెందిన ఖాతాల‌ను వాడే వారికి ఎలాంటి చార్జిల పెంపు లేద‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలు ఉన్న‌వారికి ప్ర‌స్తుతం ఉన్న చార్జిలే వ‌ర్తిస్తాయ‌ని, వాటిల్లో ఎలాంటి పెంపు లేద‌ని ఎస్‌బీఐ తెలిపింది. అలాగే ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌ను ఎస్‌బీఐ ఏటీఎంల‌లో వాడితే ఎలాంటి చార్జిలు ఉండ‌వు. మొత్తం ఉచితంగానే సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఎస్‌బీఐ ఏటీఎంల‌లో చేసే కార్డ్ లెస్ న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్స్‌కు కూడా ఎలాంటి చార్జిలు లేవు. వీటిని నెల‌కు ఎన్ని లావాదేవీలు అయినా నిర్వ‌హించుకోవచ్చు. అపరిమిత‌మైన లావాదేవీల‌కు వీలు క‌ల్పించారు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ఖాతాదారులను కూడా ఈ చార్జిల పెంపు నుంచి మిన‌హాయించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement