Benefit of Thar | థార్ ఉంటే రూల్స్ బ్రేక్ చేయొచ్చు.. రాంగ్ రూట్‌లో వెళ్లినా ఎవరూ పట్టించుకోరు.. Viral Video
మీకు థార్ (Thar) జీపు ఉందా. అయితే మీరు ఎంచక్కా రూల్స్ బ్రేక్ (Traffic Rules) చేయవచ్చు. రాంగ్ రూట్‌లో (Wrong Root) జీపును నడుపుతూ దర్జాగా వెళ్లొచ్చు. అయినా మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఇదే థార్‌తో ఉన్న ప్రయోజనం (Benefit of Thar).
త్రినేత.న్యూస్: మీకు థార్ (Thar) జీపు ఉందా. అయితే మీరు ఎంచక్కా రూల్స్ బ్రేక్ (Traffic Rules) చేయవచ్చు. రాంగ్ రూట్‌లో (Wrong Root) జీపును నడుపుతూ దర్జాగా వెళ్లొచ్చు. అయినా మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఇదే థార్‌తో ఉన్న ప్రయోజనం (Benefit of Thar). ఇది మేం చెప్పట్లేదండోయ్... ఓ థార్ జీపు ఓనర్ అభిప్రాయం. థార్‌తో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెబుతూ స్వయంగా దానిని నడుపుతూ ఏకంగా ఓ వీడియోనే రూపొందించాడు. Benefit of Thar పేరుతో దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతున్నది.
`థార్ యజమాని అయి ఉంటే ఎలాంటి సంకోచం లేకుండా ట్రాఫిక్ నియమాలను బ్రేక్ చేయవచ్చు. రోడ్డుపై రాంగ్ రూట్‌లో వెళ్లినా ఎవరూ పట్టించుకోరు. ఇదే థార్‌తో కలిగే అతిపెద్ద ప్రయోజనం` అంటూ రాంగ్ రూట్‌లో వాహనాన్ని నడుపుతూ ఓ వ్యక్తి వీడియోను రికార్డు చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తున్నది. థార్ యజమానులు తాము ఏమైనా చేయొచ్చని అనుకుంటున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కచ్చితంగా అది ఎక్కడో తెలియక పోయినప్పటికీ.. ఢిల్లీ పోలీసులకు ఆ వీడియోను ట్యాగ్ చేసి, ఆ వ్యక్తి కఠిన చర్యలు తీసుకోవాలని, అతని లైసెన్స్ క్యాన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రోహిత్ ధిల్లాన్ అనే నెటిజన్ అయితే.. `కరోనా (COVID) ముగిసింది. కానీ మన రోడ్లను మరొక మహమ్మారి ఆక్రమించింది. అదే థార్టర్డ్స్ (Thartards) మనస్తత్వ వైరస్. ఇది పిచ్చితనానికి మించింది. థార్ కొనడంతో ఇంగితం ఎలా పోతుంది?. ఇది నిజంగా ఆందోళన కలిగించేది, ప్రమాదకరమైనది. థార్ కొన్న తర్వాత మానస్థితి ఎలా మారుతో ఎవరైనా చెబితే.. వారికి కుటుంబ సమేతంగా వారం రోజులపాటు సరదగా గడిపేందుకు స్పాన్సర్ చేస్తా. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది కాబట్టి.. మీ బంధువులు, సన్నిహితులు ఈ వాహనాన్ని కొనకుండా చూసుకోండి` అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డాడు.
COVID ended, but another epidemic took over our roads the Thartards mentality virus! This mindset is beyond insane.
How does buying a vehicle suddenly delete common sense? It’s honestly shocking and dangerous.
If anyone can genuinely figure out what psychological switch… pic.twitter.com/aZF519zRdv
— Rattan Dhillon (@ShivrattanDhil1) January 11, 2026
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



