Investment On Gold | డిజిటల్ గోల్డ్ వర్సెస్ ఫిజికల్ గోల్డ్.. బంగారాన్ని ఏ రూపంలో కొంటే మంచిది..?
Investment On Gold | ప్రస్తుతం అంతర్జాతీయంగా మార్కెట్లలో బంగారం ధరలు రోజు రోజుకీ ఎలా పెరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం కారణంగా చాలా మంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ధనికులతోపాటు సామాన్య ప్రజలు కూడా బంగారాన్ని కొని డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారు.
Investment On Gold | ప్రస్తుతం అంతర్జాతీయంగా మార్కెట్లలో బంగారం ధరలు రోజు రోజుకీ ఎలా పెరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం కారణంగా చాలా మంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ధనికులతోపాటు సామాన్య ప్రజలు కూడా బంగారాన్ని కొని డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే ఆకస్మిక ఖర్చులకు ఇప్పుడు బంగారాన్ని కొని పెట్టుకుంటే అధిక ధరలకు అమ్మి ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చని చూస్తున్నారు. అందుకనే చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే బంగారం కొనుగోలు విషయానికి వస్తే డిజిటల్ గోల్డ్ అనే మాట ప్రస్తుతం చాలా వరకు వినిపిస్తోంది. ప్రజలు చాలా మంది డిజిటల్ గోల్డ్‌ను కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే డిజిటల్ గోల్డ్ వర్సెస్ ఫిజికల్ గోల్డ్.. రెండింటిలో దేనిపై పెట్టుబడి పెట్టాలి..? ఏది మనకు చక్కని రిటర్న్స్‌ను ఇస్తుంది..? అన్న వివరాలను ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.
తేడాలు ఇవే..
డిజిటల్ గోల్డ్‌ను కొంటే అనేక లాభాలు ఉంటాయి. బంగారం డిజిటల్ రూపంలో ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భౌతిక బంగారాన్ని ఇస్తారు. లేదా దాన్ని అమ్మి డబ్బు సంపాదించవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను అమ్మడం చాలా సులభం. పైగా బంగారం డిజిటల్ రూపంలో ఉంటుంది కనుక సెక్యూరిటీ అవసరం లేదు. మనకు డిజిటల్ బంగారాన్ని విక్రయించే వారు వాల్ట్‌లో దాన్ని నిల్వ చేస్తారు. కనుక మన బంగారం సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. చాలా మంది ఈ సదుపాయం వల్లే డిజటల్ బంగారాన్ని కొంటున్నారు. ఇక డిజిటల్ బంగారాన్ని చాలా తక్కువ పరిమాణంలో కూడా కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.100కు కూడా ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఇక భౌతిక బంగారం కొంటే ఆయా సదుపాయాలు ఉండవు. కనుక డిజిటల్ బంగారంపైనే చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు.
పన్ను మాత్రం చెల్లించాల్సిందే..
అయితే బంగారాన్ని ఏ రూపంలో కొన్నా దాన్ని కొనుగోలు చేసినప్పుడు 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. అలాగే బంగారాన్ని దీర్ఘకాలిక పొదుపు కోసం కొంటారు కనుక దాన్ని భవిష్యత్తులో ఎప్పుడైనా అమ్మి సొమ్ము చేసుకుంటే దానిపై12.5 శాతం మేర లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) చెల్లించాలి. ఇలా బంగారాన్ని కొనవచ్చు. అయితే సెక్యూరిటీ కష్టమని భావించే వారు, చాలా తక్కువ మొత్తంలో అప్పుడప్పుడు బంగారం కొంటాం అనుకునే వారు డిజిటల్ బంగారాన్ని కొనడం మంచిది. అనేక యూపీఐ యాప్స్‌లోనూ డిజిటల్ బంగారాన్ని కొనే సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇక సెక్యూరిటీ సమస్య కాకపోతే, భారీ ఎత్తున బంగారాన్ని తీసుకుంటే భౌతిక బంగారాన్ని కొనడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



