Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. పెట్టుబడిదారుల ఆసక్తి..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. దాదాపు అన్ని దేశాలకు చెందిన మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మాత్రం పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. దాదాపు అన్ని దేశాలకు చెందిన మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మాత్రం పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ ఆయా లోహాల ధరలు ఆల్ టైం హై స్థాయిలో ఉండడంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ధరలు చాలా తగ్గడం, మళ్లీ యుద్ధం మొదలవడంతో ఈసారి చాన్స్ వదులుకోకూడదని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే పసిడిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. గత వారంలో స్వల్పంగా తగ్గిన వీటి ధరలు ఈ వారం ప్రారంభంలోనే పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.47 శాతం మేర పెరిగి 4,397 డాలర్లకు చేరగా, వెండి ధర 1.89 శాతం మేర పెరిగి 65 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 694 పాయింట్లు పెరిగి 1,55,200 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,626 పాయింట్లు పెరిగి 2,38,550 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,566 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 528 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,660 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,56,600 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.5,300 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,270 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,160గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,27,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,676 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,408గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,760 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,67,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో వారాంతంలో జోష్.. వచ్చే వారం ఎలా ఉంటుంది..?
ఆగస్టు 15, 2026

Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
ఆగస్టు 14, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Chinnareddy | తప్పుడుగాండ్లను పార్టీ నుంచి బయటకు పంపాలి.. లేదంటే నేను మరో జీవన్ రెడ్డి కావాల్సివస్తది: చిన్నారెడ్డి
- ●IPO | ఈ వారంలో ఐపీఓల జోరు.. రూ.6,400 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు - ప్రైజ్‌మనీ మొత్తం కట్ చేశారు - పల్లవి ప్రశాంత్ కామెంట్స్
- ●Dimagi Naxal Party | మొన్న సీజేపీ.. ఇప్పుడు గ్రౌండ్లోకి దిమాగీ నక్సల్ పార్టీ..
- ●IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కుదుపు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..

Chinnareddy | తప్పుడుగాండ్లను పార్టీ నుంచి బయటకు పంపాలి.. లేదంటే నేను మరో జీవన్ రెడ్డి కావాల్సివస్తది: చిన్నారెడ్డి

IPO | ఈ వారంలో ఐపీఓల జోరు.. రూ.6,400 కోట్లకు పైగా ఇష్యూలు..

Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు - ప్రైజ్‌మనీ మొత్తం కట్ చేశారు - పల్లవి ప్రశాంత్ కామెంట్స్

Dimagi Naxal Party | మొన్న సీజేపీ.. ఇప్పుడు గ్రౌండ్లోకి దిమాగీ నక్సల్ పార్టీ..



