త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Accenture | ఏఐని వాడాల్సిందే.. లేదంటే ప్రొమోష‌న్స్ ఉండ‌వ్‌.. ఉద్యోగుల‌కు యాక్సెంచర్ స్ట్రాంగ్ వార్నింగ్‌

Accenture | ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్ సేవల సంస్థ యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు (Employees) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏఐ టూల్స్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉపయోగించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

D

Business | Published On Feb 20, 2026, 3.40 pm IST

Accenture | ఏఐని వాడాల్సిందే.. లేదంటే ప్రొమోష‌న్స్ ఉండ‌వ్‌.. ఉద్యోగుల‌కు యాక్సెంచర్ స్ట్రాంగ్ వార్నింగ్‌
Advertisement

Accenture | ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్ సేవల సంస్థ యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు (Employees) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏఐ టూల్స్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉపయోగించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ల స్థాయి వారు కేవలం పని చేస్తే సరిపోదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించాల‌ని తెలిపింది. లేదంటే ప్ర‌మోష‌న్లు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది.

నాయకత్వ బాధ్యతలు (Leadership Roles) చేపట్టాలనుకునే వారు ఖచ్చితంగా AI టూల్స్‌ను తమ పనిలో భాగంగా చేసుకోవాలని.. దీనిని "రెగ్యులర్ అడాప్షన్" (Regular Adoption) కింద పరిగణిస్తామని ఉద్యోగుల‌కు పంపిన‌ ఇంటర్నల్ ఈమెయిల్స్‌లో సంస్థ‌ వెల్లడించింది. అంతేకాదు, సీనియర్ ఉద్యోగులు వారానికి ఎన్నిసార్లు కంపెనీ అందించిన AI టూల్స్‌లోకి లాగిన్ అవుతున్నారు..? ఎంత సమయం గడుపుతున్నారు..? అనే వివరాలను హెచ్ ఆర్ విభాగం ట్రాక్ చేయ‌నుండ‌టం గ‌మ‌నార్హం. సంస్థ నిర్ణ‌యంపై ఉద్యోగులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, యాక్సెంచ‌ర్ గ‌త కొంత కాలంగా ఏఐపై ప్ర‌ధానంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే ఏఐతో రిస్కీల్ చేయ‌డం సాధ్యంకాని ఉద్యోగును తొల‌గించింది. దాదాపు 11 వేల మందిపై వేటు వేసింది.

Advertisement
Advertisement