Ambrane Reneo | టైప్-సి ఛార్జింగ్‌తో ఆంబ్రేన్ కొత్త బ్యాటరీలు.. ఒక్కటి 100 సాధారణ బ్యాటరీలకు సమానం!
Ambrane Reneo | ఆంబ్రేన్ (Ambrane) తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ కొత్తగా రెనియో AA, AAA సైజుల బ్యాటరీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. టైప్-సి రీచార్జబుల్ AA, AAA బ్యాటరీలను విడుదల చేసిన కొద్ది కంపెనీల్లో ఆంబ్రేన్ ఒకటిగా నిలిచింది. సాధారణ డిస్పోజబుల్ బ్యాటరీలకు బదులుగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే ప్రత్యామ్నాయాన్ని అందించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త క్యాటగిరీలో అడుగుపెట్టింది.
Technology | Published On May 14, 2026, 12.54 pm IST
Ambrane Reneo | ఆంబ్రేన్ (Ambrane) తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ కొత్తగా రెనియో AA, AAA సైజుల బ్యాటరీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. టైప్-సి రీచార్జబుల్ AA, AAA బ్యాటరీలను విడుదల చేసిన కొద్ది కంపెనీల్లో ఆంబ్రేన్ ఒకటిగా నిలిచింది. సాధారణ డిస్పోజబుల్ బ్యాటరీలకు బదులుగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే ప్రత్యామ్నాయాన్ని అందించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త క్యాటగిరీలో అడుగుపెట్టింది. ఈ రెనియో బ్యాటరీల ప్రధాన ప్రత్యేకత డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్. అంటే ప్రత్యేకమైన పెద్ద బ్యాటరీ ఛార్జింగ్ డాక్స్ అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే సాధారణ టైప్-సి కేబుల్‌తోనే వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో వినియోగదారులకు మరింత సౌకర్యం లభించనుంది.
ఇతర బ్యాటరీలతో పోలిస్తే అధిక కెపాసిటీ..
పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ బ్యాటరీలు ఆకట్టుకుంటున్నాయి. కేవలం 10 నిమిషాల ఎమర్జెన్సీ ఛార్జ్ ఫీచర్‌ను కంపెనీ అందించింది. పూర్తి ఛార్జ్ కావడానికి ఒకటి నుంచి రెండు గంటల లోపే సమయం పడుతుంది. ఈ బ్యాటరీలు స్టేబుల్ 1.5V అవుట్‌పుట్‌ను అందిస్తాయి. టీవీ రిమోట్లు, వైర్‌లెస్ మౌస్‌లు, టాయ్స్, ట్రిమ్మర్లు, కెమెరాలు, స్పీకర్లు, గేమింగ్ కంట్రోలర్లు వంటి రోజువారీ ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో ఉపయోగించుకునేలా రూపొందించారు. రెనియో సెల్ AAA బ్యాటరీ 740ఎంఏహెచ్ (1100mWh) సామర్థ్యంతో పనిచేస్తుంది. రెనియో సెల్ AA బ్యాటరీ 1850ఎంఏహెచ్ (2775mWh) కెపాసిటీని అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోర్ట్రోనిక్స్ టైప్-సి రీచార్జబుల్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి అధిక కెపాసిటీని కలిగి ఉన్నాయి. పోర్ట్రానిక్స్ బ్యాటరీలు AAA లో 440ఎంఏహెచ్, AA లో 1480ఎంఏహెచ్ సామర్థ్యాన్ని మాత్రమే అందిస్తున్నాయి.
100 సాధారణ బ్యాటరీలకు సమానం..
సస్టైనబిలిటీపై కూడా ఆంబ్రేన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కంపెనీ ప్రకారం ప్రతి రెనియో బ్యాటరీ దాదాపు 100 సాధారణ డిస్పోజబుల్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీంతో గృహాల్లో బ్యాటరీ వ్యర్థాలు తగ్గడమే కాకుండా, దీర్ఘకాలంలో ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. భద్రత పరంగా కూడా పలు ఫీచర్లను కంపెనీ జోడించింది. ఇన్‌బిల్ట్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ద్వారా ఓవర్ ఛార్జింగ్, ఓవర్ కరెంట్, షార్ట్ సర్క్యూట్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. అదనంగా ఈ బ్యాటరీలను లీక్-ప్రూఫ్, నాన్-ఫ్లామబుల్ డిజైన్‌తో రూపొందించారు. దీంతో ఇంటి వినియోగంలో మరింత సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త రీచార్జబుల్ బ్యాటరీలు ప్రస్తుతం ఆంబ్రేన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. రెనియో AA బ్యాటరీ ధరను రూ.499గా నిర్ణయించగా, రెనియో AAA బ్యాటరీ ధర రూ.399గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ కొత్త డబుల్ అండ్ ట్రిపుల్ ఎ సైజ్ బ్యాటరీలు.. యూఎస్బీ టైప్ సి తోనే ఛార్జింగ్..
ఆగస్టు 10, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●CM Vikarabad Tour | 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి
- ●Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- ●Harish Rao - Peddi Sudarshan Reddy | నా ప్రాణాలు కాపాడిన చేతులే విగతజీవిగా.. ఆనాటి ఘటన తలచుకొని కన్నీరుమున్నీరైన హరీశ్ రావు
- ●TPCC | ఎస్ఐఆర్పై కాంగ్రెస్ అనుమానాలు
- ●Paytm | పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక క్లాడ్ ఏఐతో చెల్లింపులు చేయవచ్చు..
- ●Palamuru-Rangareddy Project | పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం.. స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ

CM Vikarabad Tour | 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి

Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

Harish Rao - Peddi Sudarshan Reddy | నా ప్రాణాలు కాపాడిన చేతులే విగతజీవిగా.. ఆనాటి ఘటన తలచుకొని కన్నీరుమున్నీరైన హరీశ్ రావు

TPCC | ఎస్ఐఆర్పై కాంగ్రెస్ అనుమానాలు



