Credit Card Cash Withdraw | క్రెడిట్ కార్డ్‌తో క్యాష్ విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
Credit Card Cash Withdraw | ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం సాధారణ విషయమే. అయితే డెబిట్ కార్డ్‌తో నగదు తీసుకోవడం, క్రెడిట్ కార్డ్‌తో నగదు తీసుకోవడం ఒకేలా ఉండదు. లావాదేవీ ప్రక్రియ ఒకే విధంగా కనిపించినా, క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీసుకుంటే అదనపు ఫీజులు, వడ్డీ ఛార్జీలు వర్తిస్తాయి.
Credit Card Cash Withdraw | ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం సాధారణ విషయమే. అయితే డెబిట్ కార్డ్‌తో నగదు తీసుకోవడం, క్రెడిట్ కార్డ్‌తో నగదు తీసుకోవడం ఒకేలా ఉండదు. లావాదేవీ ప్రక్రియ ఒకే విధంగా కనిపించినా, క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీసుకుంటే అదనపు ఫీజులు, వడ్డీ ఛార్జీలు వర్తిస్తాయి. అందుకే క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్‌డ్రా ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించిన ఖర్చులు ఏమిటో తెలుసుకోవడం అవసరం. క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్‌డ్రా లేదా క్యాష్ అడ్వాన్స్ అనేది ఏటీఎం ద్వారా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి నగదు తీసుకునే సదుపాయం. దీనికి బ్యాంక్ నుంచి ప్రత్యేక అనుమతి లేదా డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. ఇది కార్డుతో వచ్చే ఫీచర్. అయితే అన్ని క్రెడిట్ కార్డుల్లో ఈ సదుపాయం ఉండదు. అలాగే విత్‌డ్రా పరిమితి, ఛార్జీలు బ్యాంక్‌ను బట్టి మారుతాయి. వీటిని బ్యాంకులు ఎప్పటికప్పుడు మారుస్తుంటాయి.
ఏయే బ్యాంకుల్లో ఎంత చార్జి, ఎంత వడ్డీ..
క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీసుకోవడాన్ని బ్యాంకులు సాధారణంగా ప్రోత్సహించవు. ఎందుకంటే ఇది నేరుగా నగదు రుణంగా పరిగణించబడుతుంది. అందువల్ల ప్రతి క్యాష్ అడ్వాన్స్ లావాదేవీపై ప్రత్యేక ఫీజు వసూలు చేస్తారు. సాధారణంగా ప్రముఖ బ్యాంకులు విత్‌డ్రా చేసిన మొత్తంపై 2.5 శాతం వరకు ఫీజు వసూలు చేస్తాయి. అయితే కనీసంగా రూ.250 నుంచి రూ.500 వరకు ఛార్జిలు ఉంటాయి. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నగదు విత్ డ్రా చేస్తే ఆ మొత్తంలో 2.5 శాతం లేదా రూ.500 చార్జిలను వసూలు చేస్తోంది. దీనికి నెలకు 1.99 నుంచి 3.60 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తారు. ఇక యాక్సిస్ బ్యాంకులో 2.5 శాతం లేదా రూ.500 చార్జిలు, 1.50 నుంచి 3.60 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విత్ డ్రా చార్జీలు 2.50 శాతం లేదా రూ.500 ఉండగా, నెలకు వడ్డీ 1.50 నుంచి 3.49 శాతం వరకు ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంకులో విత్ డ్రా చార్జి 2.5 శాతం లేదా రూ.300 ఉండగా, నెలకు వడ్డీ 1.79 నుంచి 3.95 శాతం వరకు ఉంది. హెచ్ఎస్‌బీసీ బ్యాంకు అయితే విత్ డ్రా చార్జిలు 2.5 శాతం లేదా రూ.500 ఉండగా, వడ్డీ 1.99 నుంచి 3.49 శాతం వరకు ఉంది. స్టాండర్డ్ చార్టర్డ్‌లో 2 శాతం లేదా రూ.300 వరకు విత్ డ్రా చార్జిలను వసూలు చేస్తున్నారు. 1.99 నుంచి 3.75 శాతం మధ్య వడ్డీని వసూలు చేస్తున్నారు. ఇవి కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కనుక బ్యాంకు అధికారిక వేదికల ద్వారా ఈ వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
లాభాలు, నష్టాలు..
క్యాష్ అడ్వాన్స్‌పై ఫీజు మాత్రమే కాదు, వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లకు లభించే గ్రేస్ పీరియడ్ క్యాష్ అడ్వాన్స్‌లకు వర్తించదు. నగదు తీసుకున్న రోజు నుంచే వడ్డీ లెక్కించడం ప్రారంభమవుతుంది. అయితే దీని వల్ల కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి. లాభాలను చూస్తే.. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే నగదు పొందే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అనుమతి లేదా డాక్యుమెంట్లు అవసరం ఉండవు. తీసుకున్న నగదును ఎలా ఖర్చు చేయాలనే పరిమితులు ఉండవు. వ్యక్తిగత రుణంతో పోలిస్తే ఇది చాలా వేగవంతమైన ఎంపిక. ఇక నష్టాల విషయానికి వస్తే.. క్యాష్ అడ్వాన్స్‌పై అధిక ఫీజులు, వడ్డీ ఛార్జీలు వర్తిస్తాయి. గ్రేస్ పీరియడ్ లేకపోవడంతో వెంటనే వడ్డీ లెక్కించడం ప్రారంభమవుతుంది. ఈ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు లభించవు. చెల్లింపు పూర్తయ్యే వరకు వడ్డీ కొనసాగుతుంది.

ఫీజులను తప్పించలేమా..
ఇక క్రెడిట్ కార్డులను ఉపయోగించి నగదు విత్ డ్రా చేసే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. క్యాష్ అడ్వాన్స్ ఫీజును తప్పించుకోవచ్చా? అని ఆలోచిస్తుంటారు. అయితే ఇందుకు నిపుణులు లేదు అని సమాధానం చెబుతున్నారు. క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటే ఫీజు చెల్లించాల్సిందే. అయితే తక్కువ మొత్తం విత్‌డ్రా చేయడం, వీలైనంత త్వరగా బకాయిని చెల్లించడం ద్వారా మొత్తం ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్‌డ్రా లిమిట్ ఎంత ఉంటుంది? అనే విషయానికి వస్తే.. ఇది మీ మొత్తం క్రెడిట్ లిమిట్‌కు సమానం కాదు. సాధారణంగా క్రెడిట్ లిమిట్‌లో ఒక నిర్దిష్ట శాతం మాత్రమే క్యాష్ లిమిట్‌గా నిర్ణయిస్తారు. ఈ వివరాలను కార్డ్ జారీ సమయంలో బ్యాంక్ తెలియజేస్తుంది. లేదా కార్డుకు చెందిన యాప్, వెబ్‌సైట్ లలో లాగిన్ అయి నగదు విత్ డ్రా లిమిట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఎలా విత్ డ్రా చేయాలి..
ఏటీఎంలో క్రెడిట్ కార్డ్‌తో ఎలా నగదు తీసుకోవాలి? అని కూడా చాలా మంది అడుగుతుంటారు. డెబిట్ కార్డ్‌తో తీసుకునే విధంగానే క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి నగదు తీసుకోవచ్చు. తేడా ఏమిటంటే అదనపు ఫీజులు, వడ్డీ ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా నగదు తీసుకోవచ్చా? అని కూడా సందేహం వస్తుంటుంది. దీనికి నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా క్యాష్ విత్‌డ్రా చేయవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఛార్జీల్లో తేడాలు ఉంటాయి. ఇక క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుందా? అని కూడా అడుగుతుంటారు. దీనికి నిపుణులు కాదు అని సమాధానం చెబుతున్నారు. కానీ బకాయిలను సమయానికి చెల్లించకపోవడం, అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి వంటి అంశాలు క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందువల్ల అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేయవద్దు అనే విషయాన్ని కార్డు హోల్డర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు

TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు





