Solar Power | సోలార్ పవర్ పెట్టిస్తున్నారా..? ఈ 5 అంశాలు తప్పనిసరి..!
Solar Power | ఇంధన ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. పర్యావరణంపై ఆందోళనలు కూడా ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కువ మంది గృహ యజమానులు సోలార్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యుత్ బిల్లులు తగ్గడం, కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, ఇంటి విలువ పెరగడం.. ఇవన్నీ సోలార్ పవర్ ఇచ్చే ప్రధాన లాభాలు.
Solar Power | ఇంధన ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. పర్యావరణంపై ఆందోళన కూడా ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కువ మంది గృహ యజమానులు సోలార్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యుత్ బిల్లులు తగ్గడం, కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, ఇంటి విలువ పెరగడం.. ఇవన్నీ సోలార్ పవర్ ఇచ్చే ప్రధాన లాభాలు. అయితే సోలార్ ప్యానెల్స్ ఒక దీర్ఘకాలిక పెట్టుబడి కావడంతో ముందస్తు ప్రణాళిక తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. సోలార్ పవర్ పెట్టుకునే ముందు ఐదు ముఖ్య అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంటి పైకప్పు స్థితి, దిశ..
సోలార్ ప్యానెల్స్ సాధారణంగా 25-30 ఏళ్లు పనిచేస్తాయి. కాబట్టి పైకప్పు బలంగా ఉండాలి. పైకప్పు పాతది లేదా నిర్మాణ లోపాలుంటే ముందే మరమ్మత్తులు లేదా మార్పిడి చేయించుకోవాలి. లేకపోతే తర్వాత ప్యానెల్స్ తీసి మళ్లీ అమర్చే ఖర్చు పెరుగుతుంది. దేశంలో దక్షిణ దిశగా ఉన్న పైకప్పులు ఎక్కువ సూర్యకాంతి అందుకుంటాయి. చెట్లు లేదా పక్క భవనాల నీడ పడకపోతే పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిపుణుల సైట్ విజిట్‌తో సరైన కోణం, స్థానం నిర్ణయించుకోవచ్చు.
ప్రస్తుత విద్యుత్ వినియోగం..
గత 12 నెలల విద్యుత్ బిల్లులను పరిశీలించి సగటు నెలవారీ/సంవత్సర వినియోగం (kWhలో) ఎంత ఉందో అంచనా వేయాలి. దీని ఆధారంగా మీ అవసరాలకు సరిపోయే సామర్థ్యంతో సోలార్ సిస్టమ్‌ను డిజైన్ చేయవచ్చు. సరైన సైజింగ్ లేకపోతే సేవింగ్స్ తగ్గుతాయి.
ఖర్చులు, పొదుపు లెక్కలు..
ప్యానెల్స్ ధరలు తగ్గినా, ప్రారంభ పెట్టుబడి గణనీయంగానే ఉంటుంది. ప్యానెల్స్‌తో పాటు ఇన్వర్టర్లు, మౌంటింగ్ స్ట్రక్చర్లు, AC/DC డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, కేబుల్స్, అనుమతులు, కార్మిక ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ సబ్సిడీలు, నెట్ మీటరింగ్ పాలసీలు మొత్తం ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సోలార్ సబ్సిడీ వివరాలను తెలుసుకుంటే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా 4-5 ఏళ్లలో పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బహుళ ఇన్‌స్టాలర్ల నుంచి కొటేషన్లు తీసుకుని, ఫైనాన్సింగ్ ఆప్షన్లు (లోన్లు/లీజ్‌లు), ROI అంచనాలను పోల్చి నిర్ణయం తీసువాల్సి ఉంటుంది.
సరైన సోలార్ సిస్టమ్ ఎంపిక..
సోలార్ పవర్‌లో మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. మొదటిది ఆన్ గ్రిడ్. ఇందులో బిగించే సోలార్ ప్యానెల్స్‌కు మీటర్ ఇస్తారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్‌కు వెళ్తుంది. వినియోగారులు తమ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించవచ్చు. గ్రిడ్‌కు అలా విక్రయించే విద్యుత్ నెలవారి బిల్లులో ఆదా అవుతుంది. దీంతో నెల నెలా బిల్లు తక్కువగా వస్తుంది. ఇక సోలార్ పవర్ లో రెండోది ఆఫ్ గ్రిడ్. దీన్ని గ్రిడ్‌కు కనెక్ట్ చేయరు. బ్యాటరీలకు కనెక్ట్ అవుతాయి. ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీల్లో స్టోర్ అవుతుంది. దాన్ని వినియోగదారులు తమకు కావల్సిన సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఇక ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ రెండూ కలిపి ఉండే సోలార్ పవర్‌ను హైబ్రిడ్ సిస్టమ్ అంటారు. ఇందులో మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించవచ్చు, బ్యాటరీల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. ఇలా సోలార్ పవర్ సిస్టమ్‌లు పనిచేస్తాయి.
సర్టిఫైడ్ ఇన్‌స్టాలర్లతోనే..
ఇన్‌స్టాలేషన్ నాణ్యతే భద్రత, పనితీరుకు కీలకం. అనుభవం ఉన్న, ప్రభుత్వ ప్రమాణాలు పాటించే ఇన్‌స్టాలర్లను ఎంచువాలి. న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ (MNRE) లో ఎంపానెల్ అయిన సంస్థలు అయితే మరింత మంచిది. వారంటీలు, అనుమతుల ప్రక్రియ, సబ్సిడీ దరఖాస్తులు, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ అన్నీ చూసుకున్న తరువాతే సోలార్ పవర్ సిస్టమ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






