Home Buying | ఇంటిని కొనుగోలు చేస్తున్నారా.. ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..
Home Buying | జీవితంలో ఎలాగైనా సరే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని చాలా మంది కష్టపడుతుంటారు. సొంత ఇల్లు ఉంటే ఇక ఎలాంటి ఢోకా ఉండదని అందరి విశ్వాసం. అందుకనే నగరాలు, పట్టణాలు, గ్రామాలు.. ఎక్కడ ఉన్నా సరే చాలా మంది సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఆశిస్తుంటారు.
Home Buying | జీవితంలో ఎలాగైనా సరే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని చాలా మంది కష్టపడుతుంటారు. సొంత ఇల్లు ఉంటే ఇక ఎలాంటి ఢోకా ఉండదని అందరి విశ్వాసం. అందుకనే నగరాలు, పట్టణాలు, గ్రామాలు.. ఎక్కడ ఉన్నా సరే చాలా మంది సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఆశిస్తుంటారు. అయితే సొంత ఇంటి కల అనేది జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయం. దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యతగా ఉండే ఈ నిర్ణయం కుటుంబానికి భవిష్యత్తులో సంపద, స్థిరత్వం, భద్రతను ఎలా నిర్మించుకుంటారనే అంశాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్నా చాలా మంది ప్రజలు సొంత ఇంటి కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే చూస్తున్నారు. కానీ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఇంటిని కొన్నాక లేదా స్థలంలో ఇంటిని నిర్మించాక చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అలా వ్యవహరించడం సరైందే. అయినప్పటికీ ఇతర విషయాల్లో చాలా మంది తప్పులు చేస్తుంటారు.
వీటిపై లుక్కేయండి..
ఎప్పటికప్పుడు మారుతూ ఉండే వడ్డీ రేట్లు, ఆదాయం, ఖర్చులు వంటి కారణాల వల్ల ప్రాపర్టీల ధరలు మారుతున్నాయి. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారు మాత్రం పలు అంశాలను లోతుగా అర్థం చేసుకుని, నిపుణులతో చర్చించి, పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ హోమ్ లోన్ సీఈవో, కో-ఫౌండర్ అతుల్ మోంగా తెలిపిన ప్రకారం, మార్కెట్ టైమింగ్ కంటే దీర్ఘకాలిక విలువ, లొకేషన్ ఫండమెంటల్స్, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. పెద్ద లోన్ తీసుకునే ముందు లోన్ అర్హత, రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయాలన్నారు. అందుబాటులో ఉన్న ఎంపికలను పోల్చి, వ్యక్తిగత అవసరాలకు సరిపడే వాటిని ఎంచుకోవాలని ఆయన సూచించారు. అలాగే కేవలం ఈఎంఐలు, వడ్డీ రేట్లను మాత్రమే కాకుండా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ట్యాక్స్‌లు, మెయింటెనెన్స్ వంటి ఖర్చులను ముందుగానే లెక్కలోకి తీసుకోవాలని అన్నారు.
ఏటా 5-7 శాతం పెరగనున్న ధరలు..
అట్మాస్ఫియర్ లివింగ్ గ్లోబల్ సీఈవో సందీప్ అహుజా తెలిపిన ప్రకారం 2026లో హౌసింగ్ మార్కెట్ మరింత నియంత్రిత దశలోకి ప్రవేశించిందన్నారు. ఇప్పుడు మార్కెట్ ప్రధానంగా ఎండ్-యూజ్ డిమాండ్‌పై ఆధారపడుతోందని, ఊహాగానాలపై కాదని తెలిపారు. టాప్ 7 నగరాల్లో 2026 మొదటి త్రైమాసికంలో సుమారు 1.01 లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 7 శాతం తగ్గుదల నమోదు చేసిందని తెలిపారు. అయినప్పటికీ ధరలు స్థిరంగా ఉండడం డిమాండ్ బలంగా ఉందని సూచిస్తోందన్నారు. 2025లో సుమారు 3.95 లక్షల యూనిట్లు అమ్ముడైనప్పటికీ, మొత్తం లావాదేవీ విలువ రూ.6 లక్షల కోట్లను దాటిందని, ఇది ప్రీమియం గృహాలపై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ప్రాపర్టీ ధరలు సంవత్సరానికి 5-7 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. హైవేలు, ట్రాన్సిట్ కారిడార్లు, కమర్షియల్ హబ్‌ల వంటి మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా పెరుగుతోందని, మొదటిసారి ఇల్లు కొనేవారికి ధర కంటే లొకేషన్, భవిష్యత్తు కనెక్టివిటీ ముఖ్యమవుతోందని తెలిపారు.

ఈఎంఐ-ఇన్‌కమ్ నిష్పత్తిని పరిశీలించాలి..
RERA వంటి నియంత్రణ వ్యవస్థల బలోపేతం వల్ల పారదర్శకత, ప్రాజెక్ట్ డెలివరీ టైమ్‌లైన్లు మెరుగుపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కొనుగోలుదారుల నమ్మకాన్ని పెంచిందని, ముఖ్యంగా అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌లపై ప్రజలు ఇప్పుడు విశ్వాసం కనబరుస్తున్నారని తెలిపారు. అయితే అఫోర్డబిలిటీ ఇంకా కీలక అంశంగా మిగిలిందని, హోమ్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా 7 శాతం నుంచి ప్రారంభమవుతాయని, కనుక ఈఎంఐ-ఇన్‌కమ్ నిష్పత్తిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న హోం లోన్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో హోం లోన్ల వడ్డీ రేట్లు..
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 7.25% నుంచి 8.95%
- బ్యాంక్ ఆఫ్ బరోడా - 7.20% నుంచి 9.25%
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 7.15% నుంచి 9.50%
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 7.25% నుంచి 9.30%
- బ్యాంక్ ఆఫ్ ఇండియా - 7.10% నుంచి 10.25%
- కెనరా బ్యాంక్ - 7.15% నుంచి 10.00%
- యూకో బ్యాంక్ - 7.15% నుంచి 9.25%
ఇవి తప్పనిసరి..
మొదటిసారిగా ఇల్లును కొనుగోలు చేసేవారు పలు అంశాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ టైమింగ్ కంటే భవిష్యత్తు వృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలని, ఈఎంఐలతో పాటు జీవనశైలిపై ప్రభావాన్ని కూడా పరిశీలించాలని, లెండర్లను ముందుగానే పోల్చుకుని వడ్డీ రేట్లు, షరతులు, ప్రీ-అప్రూవల్ అవకాశాలను పరిశీలించాలని, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటి హిడెన్ ఖర్చులను తెలుసుకోవాలని, 750కు పైగా స్కోర్ ఉంటే లోన్ ఆమోదం సులభం అవుతుందనే విషయాలను తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక ఇల్లు కొనుగోలు అనేది త్వరపడే నిర్ణయం కాదని, ఇది పూర్తి ప్రణాళిక, ఆర్థిక నియంత్రణ, సరైన లొకేషన్ ఎంపికపై ఆధారపడి ఉండాలని సూచించారు. స్థిరమైన డిమాండ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న ధరల నేపథ్యంలో జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయమే విజయవంతమైన పెట్టుబడికి దారి తీస్తుందని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



