IDFC First | బిజినెస్ ఓనర్ల కోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ కొత్త మెటల్ క్రెడిట్ కార్డ్
IDFC First | ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఫౌండర్లు, ఎంట్రప్రెన్యూర్లు, బిజినెస్ ఓనర్లను లక్ష్యంగా చేసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఆధారిత బిజినెస్ మల్టిప్లయర్ మెటల్ క్రెడిట్ కార్డ్ ను ప్రవేశపెట్టింది. వ్యాపార ఖర్చులను వ్యక్తిగత ఖర్చుల నుంచి వేరుగా నిర్వహించేందుకు ప్రత్యేక క్రెడిట్ లిమిట్ సౌకర్యంతో ఈ కార్డ్‌ను రూపొందించినట్లు బ్యాంక్ వెల్లడించింది.
IDFC First | ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఫౌండర్లు, ఎంట్రప్రెన్యూర్లు, బిజినెస్ ఓనర్లను లక్ష్యంగా చేసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఆధారిత బిజినెస్ మల్టిప్లయర్ మెటల్ క్రెడిట్ కార్డ్ ను ప్రవేశపెట్టింది. వ్యాపార ఖర్చులను వ్యక్తిగత ఖర్చుల నుంచి వేరుగా నిర్వహించేందుకు ప్రత్యేక క్రెడిట్ లిమిట్ సౌకర్యంతో ఈ కార్డ్‌ను రూపొందించినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ మెటల్ క్రెడిట్ కార్డ్‌పై బిజినెస్ పేరు, కార్డ్ హోల్డర్ పేరు రెండూ ఉంటాయి. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం ఆఫీస్ సప్లైస్, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్లు, ట్రావెల్, ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లు, ఇన్వెంటరీ, ఇంటర్నేషనల్ వెండార్ పేమెంట్స్, ఉద్యోగుల రీయింబర్స్‌మెంట్స్ వంటి వ్యాపార సంబంధిత ఖర్చుల కోసం ఈ కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.
45 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ సౌకర్యం..
ఈ కార్డ్‌కు లభించే క్రెడిట్ లిమిట్ బ్యాంకులో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అనుసంధానంగా ఉంటుంది. కనీసం రూ.50వేల ఎఫ్‌డీతో అర్హత ప్రారంభమవుతుంది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా అదనపు ఎఫ్‌డీలు క్రియేట్ చేయడం లేదా లింక్ చేయడం ద్వారా క్రెడిట్ లిమిట్‌ను పెంచుకునే అవకాశం కల్పించారు. కార్డ్‌పై గరిష్టంగా 45 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత బాకీ మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఎంపిక చేసిన ఖర్చుల కేటగిరీలపై రివార్డ్స్, రియల్‌టైమ్ స్పెండింగ్ విజిబిలిటీ, అంతర్జాతీయ లావాదేవీలపై జీరో ఫారెక్స్ మార్కప్ వంటి ప్రయోజనాలు కూడా ఈ కార్డ్ ద్వారా ఇస్తున్నారు. అలాగే యూపీఐ ఆధారిత వెండార్ పేమెంట్స్, ఖర్చుల నియంత్రణతో ఉద్యోగుల కోసం అదనపు కార్డుల జారీ, నెలవారీ ఖర్చుల ప్రమాణాల ఆధారంగా లాంజ్ యాక్సెస్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్లపై రివార్డ్ రిడంప్షన్ సదుపాయం కూడా కల్పించారు.
కార్డు ఫీజు, వార్షిక ఫీజు వివరాలు..
ఈ కార్డ్‌కు జాయినింగ్ ఫీ రూ.1వేయి కాగా, వార్షిక ఫీ కూడా రూ.1వేయిగా నిర్ణయించారు. అయితే ఏడాదికి రూ.5 లక్షల ఖర్చు చేస్తే వార్షిక ఫీ మాఫీ అవుతుంది. బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్స్, ఫాస్‌ట్యాగ్ అండ్ లాయల్టీ విభాగాధిపతి శిరీష్ భండారి మాట్లాడుతూ వ్యాపారాలకు క్రమబద్ధమైన వర్కింగ్ క్యాపిటల్ యాక్సెస్, ఖర్చుల నిర్వహణ టూల్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఉత్పత్తిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం వృద్ధి దశలో ఉన్న అనేక వ్యాపారాలు ఆపరేషనల్ ఖర్చుల కోసం డెబిట్ కార్డులు లేదా రిటైల్ కార్డులపై ఆధారపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన కస్టమర్లు బ్యాంక్ మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైల్, ఎంఎస్‌ఎంఈ, బిజినెస్ కస్టమర్ల కోసం అందిస్తున్న విస్తృత ఉత్పత్తుల శ్రేణిలో భాగంగానే ఈ కొత్త కార్డ్‌ను తీసుకొచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






