త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICICI Bank | ఖాతాదారుల‌కు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్‌.. డిసెంబ‌ర్ 1 నుంచి డిపాజిట్, ఉపసంహరణ చార్జీల పెంపు

ICICI Bank | ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ (ICICI Bank) త‌న ఖాతాదారుల‌కు షాక్ ఇవ్వ‌నుంది. డిసెంబర్‌ 1 నుంచి సేవింగ్స్‌ ఖాతాల స‌ర్వీస్‌ చార్జీలను (Service Charges) పెంచనుంది.

G

Business | Published On Oct 23, 2026, 7.12 am IST

ICICI Bank | ఖాతాదారుల‌కు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్‌.. డిసెంబ‌ర్ 1 నుంచి డిపాజిట్, ఉపసంహరణ చార్జీల పెంపు
Advertisement

ICICI Bank | త్రినేత్ర న్యూస్‌: ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ (ICICI Bank) త‌న ఖాతాదారుల‌కు షాక్ ఇవ్వ‌నుంది. డిసెంబర్‌ 1 నుంచి సేవింగ్స్‌ ఖాతాల స‌ర్వీస్‌ చార్జీలను (Service Charges) పెంచనుంది. ఒక పరిమితి దాటిన తర్వాత చేసే నగదు లావాదేవీలపై చార్జీల మొత్తాన్ని పెంచుతున్నట్లు త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఇ-మెయిల్ ద్వారా స‌మాచారం అందించింది. వినియోగదారులు ప్రతి నెలా మూడు ఉచిత నగదు డిపాజిట్లు, మూడు ఉచిత నగదు ఉపసంహరణలు పొంద‌వ‌చ్చు. డిపాజిట్‌ అయినా, విత్‌డ్రాయల్‌ అయినా నెలకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాత్రమే చార్జీ పడదు.

అయితే నెల మొత్తంమీద డిపాజిట్‌ లేదా విత్‌డ్రా లిమిట్‌ రూ.లక్ష దాటిన త‌ర్వాత లేదా ఉచిత లావాదేవీల సంఖ్య పూర్త‌యిన త‌ర్వాత జ‌రిగే ప్ర‌తి న‌గ‌దు లావాదేవీల‌పై చార్జీలు పెంచింది. దీంతో ప్రతి రూ.1000కి ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న‌ రూ.3.50 చార్జీ రూ.4కి పెరగనుంది. రూ.లక్ష మించాక, సర్వీస్ చార్జీ కింద రూ.150 లేదా రూ.1000కు పడే చార్జీని లెక్కించి.. ఏది ఎక్కువైతే అది వర్తింపజేస్తారు.

ఇక ఒక నెలలో క్యాష్ డిపాజిట్ లేదా విత్‌డ్రా ట్రాన్సాక్షన్ విలువ రూ. 1.01 లక్షలుగా ఉన్నట్లయితే, ట్రాన్సాక్షన్ చార్జీల (Transaction Charges) కింద రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో రూ. 1.38 లక్షలుగా ఉన్నట్లయితే ఇక్కడ ప్రతి రూ. 1000పై రూ.4 చొప్పున లెక్కిస్తే అది రూ. 52 అవుతుంది. కాబట్టి ఇది కనీస చార్జీ రూ.150 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అధిక విలువ అయిన రూ .152 చెల్లించాల్సి వ‌స్తుంది. నెలకు 3 క్యాష్ డిపాజిట్, 3 క్యాష్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్స్ (Cash Withdrawal) ఉచితంగానే చేసుకోవచ్చు. కాగా, స‌వ‌రించిన చార్జీలు ఐసీఐసీఐ బ్యాంకు శాఖ‌ల్లో నేరుగా న‌గ‌దు రూపంలో చేసే డిపాజిట్లు, ఉప‌సంహ‌ర‌ణ‌లు, క్యాష్ రీసైక్ల‌ర్ మెషీన్ల ద్వారా చేసే న‌గ‌దు డిపాజిట్ల‌కు వ‌ర్తిస్తాయి.

తగినంత నిధులు లేకపోవడం వంటి ఆర్థిక కారణాల వల్ల జరిగే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ECS), నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) డెబిట్ రిటర్న్‌లపై విధించే జరిమానాలను కూడా సవరించనుంది. అదేవిధంగా మొదటి రిటర్న్‌పై చార్జీ రూ.500గా ఉంటుంది. అయితే అదే మాండేట్ కింద రెండో, మూడవ రిటర్న్‌లపై ఒక్కొక్కదానికి రూ.550 చొప్పున జరిమానా విధించనున్నారు. ఒకే మాండేట్ కోసం బ్యాంక్ నెలకు గరిష్టంగా మూడు సార్లు చార్జీలను వసూలు చేయవచ్చు. లోన్ ఈఎంఐలు, ఇతర ఆటోమేటిక్ డెబిట్‌లతో (Auto Debit) సహా, వారి పొదుపు ఖాతాలకు అనుసంధానించబడిన పునరావృత చెల్లింపులు ఉన్న కస్టమర్లకు ఈ జరిమానాలు వర్తిస్తాయి. అయితే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలతోపాటు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల (BSBDA)కు ఎలాంటి టాన్సాక్ష‌న్ చార్జీలు ఉండ‌వ‌ని తెలిపింది.

Advertisement
Advertisement