త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PAN Card | 10 నిమిషాల్లో ఉచితంగా ఈ-పాన్ కార్డు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

PAN Card | ప్రస్తుత డిజిటల్ యుగంలో పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతా తెరవడం, ఆదాయపు పన్ను చెల్లించడం వంటి అనేక అవసరాలకు కీలక పత్రంగా మారింది. ఒకప్పుడు పాన్ కార్డు పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తు చేసిన తర్వాత కూడా వారాల తరబడి వేచి చూడాల్సి ఉండేది.

S

Business | Published On Jul 23, 2026, 2.19 pm IST

PAN Card | 10 నిమిషాల్లో ఉచితంగా ఈ-పాన్ కార్డు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Advertisement

PAN Card | ప్రస్తుత డిజిటల్ యుగంలో పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతా తెరవడం, ఆదాయపు పన్ను చెల్లించడం వంటి అనేక అవసరాలకు కీలక పత్రంగా మారింది. ఒకప్పుడు పాన్ కార్డు పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తు చేసిన తర్వాత కూడా వారాల తరబడి వేచి చూడాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా, సులభంగా మార్చింది. ఆధార్ కార్డు సహాయంతో ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో కొత్త ఈ-పాన్ కార్డును పూర్తిగా ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆన్‌లైన్ ప్రక్రియ, అర్హతలు, పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఇలా..

ఈ-పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అలాగే చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి. ఆ ఆధార్ నంబర్ ఇప్పటికే మరే ఇతర పాన్ కార్డుతో అనుసంధానమై ఉండకూడదు. ముఖ్యంగా ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మొత్తం దరఖాస్తు ప్రక్రియ ఓటీపీ ధ్రువీకరణ ఆధారంగా పూర్తవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మొబైల్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometax.gov.in ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో ఎడమవైపున కనిపించే క్విక్ లింక్స్ విభాగంలో ఇన్‌స్టంట్ ఈ-పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

10 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు..

కొత్త పేజీలో గెట్ న్యూ ఈ-పాన్ బటన్‌ను ఎంచుకోవాలి. అనంతరం 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, నిబంధనలు, షరతులను అంగీకరిస్తున్నట్లు చూపించే బాక్స్‌పై టిక్ చేయాలి. తర్వాత ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి కన్‌ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఓటీపీ విజయవంతంగా ధ్రువీకరించిన తర్వాత ఆధార్‌లో ఉన్న ఫొటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసుకొస్తుంది. వాటిని పూర్తిగా పరిశీలించి సరైనవని నిర్ధారించుకున్న తర్వాత దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తును విజయవంతంగా సమర్పించిన వెంటనే ఒక రసీదు నంబర్ లభిస్తుంది. దాదాపు 10 నిమిషాల తర్వాత అదే వెబ్‌సైట్‌లోకి వెళ్లి పీడీఎఫ్ రూపంలో డిజిటల్ ఈ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement