Retirement Corpus Fund | రిటైర్మెంట్ అయ్యాక ఎంత కార్పస్ ఉంటే మంచిది..? రూ.1 కోటి లేదా రూ.2 కోట్లు..?
Retirement Corpus Fund | రిటైర్మెంట్ అయ్యాక ఎలాంటి చీకు చింతా లేకుండా శేష జీవితాన్ని హాయిగా గడపాలని చాలా మంది కోరుకుంటారు. అందుకనే రిటైర్మెంట్ అనంతరం ఉపయోగపడేందుకు డబ్బును పొదుపు చేస్తుంటారు. రిటైర్ అయ్యాక నెలవారి ఖర్చులు లేదా ఇతర అవసరాలకు డబ్బులు కావాలి కనుక ఆ రిటైర్మెంట్ ఫండ్ ఉపయోగపడుతుంది.
Retirement Corpus Fund | రిటైర్మెంట్ అయ్యాక ఎలాంటి చీకు చింతా లేకుండా శేష జీవితాన్ని హాయిగా గడపాలని చాలా మంది కోరుకుంటారు. అందుకనే రిటైర్మెంట్ అనంతరం ఉపయోగపడేందుకు డబ్బును పొదుపు చేస్తుంటారు. రిటైర్ అయ్యాక నెలవారి ఖర్చులు లేదా ఇతర అవసరాలకు డబ్బులు కావాలి కనుక ఆ రిటైర్మెంట్ ఫండ్ ఉపయోగపడుతుంది. అయితే రిటైర్మెంట్ వరకు రూ.1 కోటి పొదుపు చేస్తే చాలని, తరువాత హాయిగా జీవించవచ్చని చాలా మంది అనుకుంటారు. అయితే వినడానికి రూ.1 కోటి అనే సంఖ్య సంతృప్తికరంగానే అనిపించినప్పటికీ వాస్తవానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆ మొత్తం భవిష్యత్తులో ఖర్చులకు సరిపోకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల పదవీ విరమణ ప్రణాళికను కచ్చితంగా లెక్కించాలని సూచిస్తున్నారు.
పెరగనున్న జీవన వ్యయం..
పదవీ విరమణ అనంతరం ఉపయోగించుకునే నిధులపై ద్రవ్యోల్బణంతోపాటు పన్నుల ప్రభావం కూడా పడుతుంది. రిటైర్మెంట్ ఫండ్స్‌ను ఈ రెండు అంశాలు క్లిష్టతరం చేస్తాయి. ఇవి కాలక్రమేణా పొదుపు విలువను తగ్గిస్తాయి. అందువల్ల కచ్చితమైన లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ పొందాక ఆ తరువాత జీవితం గడిపేందుకు రూ.1 కోటి సరిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తే, చాలా మంది సరిపోతుందనే చెబుతారు. కానీ దేశంలో సౌకర్యవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి సాధారణంగా ఆ మొత్తం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సులో ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష సంపాదిస్తూ రూ.50వేలు నెల నెలా ఖర్చు చేస్తున్నాడని అనుకుఉంటే, అతను 65 ఏళ్లకు రిటైర్ అయితే 20 నుంచి 30 ఏళ్ల పాటు తన జీవన ఖర్చులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమ శిక్షణతో డబ్బును పొదుపు చేసినా, ద్రవ్యోల్బణం, పన్నుల కారణంగా జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.
ఆ మొత్తం సరిపోదా..?
ఉదాహరణకు రూ.1.50 కోట్ల కార్పస్‌పై 5 శాతం విత్‌డ్రాయల్ రేటుతో మొదట నెలకు రూ.75వేలు పొందవచ్చు. ఇది ప్రారంభంలో సరిపోతుందని అనిపించినా, 12 నుంచి 24 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణం కారణంగా నెలవారి ఖర్చులు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆ కార్పస్ సరిపోదు. ప్రత్యేకంగా వైద్య ఖర్చులు మన దేశంలో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇవి సంవత్సరానికి 10 నుంచి 12 శాతం వరకు పెరుగుతాయి. ఇతర ఖర్చుల మాదిరిగా వీటిని తగ్గించడం సాధ్యం కాదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం అధికంగా ఉండడం వల్ల రూ.1 కోటి నుంచి రూ.1.50 కోట్ల లక్ష్యం చాలా మందికి సరిపోదు. ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరం డబ్బు విలువను తగ్గిస్తుంది. అలాగే ప్రస్తుతం సరిపోతుందని అనిపించే మొత్తం 10, 20 లేదా 30 ఏళ్ల తరువాత సరిపోదు.

భారీ కార్పస్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలి..
సౌకర్యవంతమైన పదవీ విరమణ కోసం ఎంత మొత్తం అవసరమే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. దీనికి నిపుణులు భిన్నమైన సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు, ముందుగానే రిటైర్ అవ్వాలని భావించే వారు సాధారణంగా రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య కార్పస్‌ను జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల కార్పస్ కాగితాలపై సరిపోతుందని కనిపిస్తుంది. కానీ ద్రవ్యోల్బణం, ఆరోగ్య ఖర్చులు, మార్కెట్ మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం సరిపోదని అర్థమవుతుంది. అందువల్ల పెట్టుడిదారులు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల కార్పస్ జమను లక్ష్యంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో భద్రతను, లావాదేవీలకు సౌలభ్యాన్ని అందిస్తుంది.
పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు..
భారీ కార్పస్ లక్ష్యం కొన్ని కీలకమైన ప్రయోజనాలను సైతం అందిస్తుంది. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణ భయాలను తగ్గిస్తుంది. వాటిని ఎదుర్కొనే మానసిక సంసిద్ధత ఇస్తుంది. అలాగే పదవీ విరమణ అనంతరం స్థిరమైన ఆదాయం లభిస్తుంది. జీవనశైలి మార్పులు లేదా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన సౌలభ్యం ఉంటుంది. అలాగే పెట్టుబడుల మార్పులు, మార్కెట్ సైకిల్స్ ప్రభావాన్ని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. పదవీ విరమణ అవసరాలను ప్రభావితం చేసే అంశాలు కూడా చాలా కీలకమైనవే అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి, భవిష్యత్తులో ఖర్చులు ఎలా మారుతాయి అనే విషయాలు చాలా ముఖ్యమైనవి. రిటైర్మెంట్ కాలం ఎంత కాలం పాటు కొనసాగుతుందో కూడా కీలకం. ఆరోగ్య, వైద్య ఖర్చులు సాధారణ ద్రవ్యోల్బణం కన్నా వేగంగా పెరుగుతాయి. అప్పులు, కుటుంబ బాధ్యతలు లేదా కొత్త వ్యాపారాల వంటి అంశాలకు నిధులు అవసరం అవుతాయి. అలాగే ద్రవ్యోల్బణం, పెట్టుబడుల రాబడులు కూడా పొదుపుల నిజమైన విలువను నిర్ణయిస్తాయి. అందువల్ల పదవీ విరమణ అనంతరం ఎంత కార్పస్ కావాలో ముందుగానే సరైన అంచనా వేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



