త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhar Lock | ఆధార్ యాప్ లో ఉన్న లాక్‌, అన్‌లాక్ ఫీచ‌ర్‌.. ఏం చేస్తుంది, ఎలా ఉప‌యోగించాలి..?

Aadhar Lock | యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వెబ్‌సైట్‌తోపాటు mAadhaar యాప్‌లో ఆధార్ లాక్/అన్‌లాక్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తోంది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ప్ర‌జ‌లు త‌మ ఆధార్ ను లాక్ చేసుకోవ‌చ్చు. త‌మ‌కు కావ‌ల్సిన‌ప్పుడు అన్ లాక్ చేసుకుని ఆధార్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

S

Business | Published On Feb 22, 2026, 8.25 am IST

Aadhar Lock | ఆధార్ యాప్ లో ఉన్న లాక్‌, అన్‌లాక్ ఫీచ‌ర్‌.. ఏం చేస్తుంది, ఎలా ఉప‌యోగించాలి..?
Advertisement

Aadhar Lock | యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వెబ్‌సైట్‌తోపాటు mAadhaar యాప్‌లో ఆధార్ లాక్/అన్‌లాక్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తోంది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ప్ర‌జ‌లు త‌మ ఆధార్ ను లాక్ చేసుకోవ‌చ్చు. త‌మ‌కు కావ‌ల్సిన‌ప్పుడు అన్ లాక్ చేసుకుని ఆధార్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఆధార్ పూర్తిగా ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీన్ని ఇత‌రులు ఎవ‌రూ ఉపయోగించ‌లేరు. మోసాల‌కు, నేరాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉండ‌దు. ఆధార్‌ను పూర్తిగా నియంత్రించే అవ‌కాశాన్ని ఈ ఫీచ‌ర్ అందిస్తోంది. వ్య‌క్తిగ‌త సమాచార భ‌ద్ర‌త‌, గోప్య‌త‌పై ఆందోళ‌న చెంద‌కుండా నిశ్చింత‌గా ఉండ‌వ‌చ్చు. ఆధార్‌ను సుర‌క్షితంగా ఉప‌యోగించ‌వ‌చ్చు.

ప్ర‌జ‌లు ఈ లాకింగ్ స‌దుపాయం ద్వారా ఆధార్‌ను లాక్ చేసినప్పుడు ఆధార్ నంబర్ ద్వారా జరిగే ధ్రువీకరణను UIDAI తాత్కాలికంగా నిలిపివేస్తుంది. దీని వ‌ల్ల ఆధార్ ధ్రువీక‌ర‌ణ‌ను ఇత‌రులెవ‌రూ పూర్తి చేయ‌లేరు. మ‌ళ్లీ ఆధార్ కార్డు దారుడు అన్‌లాక్ చేస్తేనే ఆధార్ సేవ‌లు ప‌నిచేస్తాయి. ఇలా కార్డు హోల్డ‌ర్ల‌కు ఆధార్ ఉప‌యోగంపై పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ ఉంటుంది. అయితే ఆధార్‌ను లాక్ చేశాక ఆధార్ కు అనుసంధానం అయి ఉండే తాత్కాలిక 16 అంకెల సంఖ్య వ‌ర్చువ‌ల్ ఐడీ (VID)ని పౌరులు ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల అస‌లు ఆధార్ నంబ‌ర్‌తో ప‌ని ఉండ‌దు. ధ్రువీక‌ర‌ణ కోసం కూడా VIDని ఉప‌యోగించ‌వ‌చ్చు.

mAadhaar యాప్‌తో ఆధార్ లాక్‌..

  • Google Play Store లేదా Apple App Store నుండి mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి.
  • రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీని ఉపయోగించి mAadhaar యాప్‌లో లాగిన్ అవ్వాలి.
  • Services విభాగానికి వెళ్లి Aadhaar Lock/Unlock ను ఎంచుకోవాలి.
  • Lock Aadhaar ను ఎంచుకుని స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించాలి.
  • ధ్రువీకరణ కోసం ఆధార్ నంబర్, ఓటీపీని ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.

ఇదే విధానంలో UIDAI వెబ్‌సైట్ ద్వారా కూడా ఆధార్‌ను లాక్ చేయ‌వ‌చ్చు.

ఆధార్ అన్‌లాక్ ఇలా..

ఆధార్‌ను అన్‌లాక్ చేసే విధానం చాలా సులభంగానే ఉంటుంది. ఇందుకు గాను ఆధార్ కార్డు దారుడు తాజా 16 అంకెల VIDని క‌లిగి ఉండాలి. అది లేక‌పోతే ముందుగా దాన్ని జ‌న‌రేట్ చేయాల్సి ఉంటుంది. ఆ త‌రువాత ఈ స్టెప్స్ పాటించాలి.

  • UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • Unlock బటన్‌ను ఎంచుకోవాలి.
  • తాజా VID, సెక్యూరిటీ కోడ్‌ను ఎంట‌ర్ చేసి send OTP పై క్లిక్ చేయాలి. లేదా TOTP ను ఎంచుకుని submit పై క్లిక్ చేయాలి.
  • UID విజయవంతంగా అన్‌లాక్ అవుతుంది.
Advertisement
Advertisement