Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
Arrest | ఏటీఎం వద్ద నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లిన వ్యక్తిని ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తనకు నగదు ఇస్తే ఫోన్‌పేలో పంపిస్తానని నమ్మబలికి నకిలీ ఆన్‌లైన్ పేమెంట్ స్క్రీన్‌షాట్ చూపించి రూ.10 వేలు కాజేశాడు.
- ఏటీఎం వద్ద బురిడి కొట్టించిన కేటుగాడు
- పురానాహవేలి సిటీ సివిల్ కోర్టు వద్ద ఘటన
త్రినేత్ర.న్యూస్: ఏటీఎం వద్ద నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లిన వ్యక్తిని ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తనకు నగదు ఇస్తే ఫోన్‌పేలో పంపిస్తానని నమ్మబలికి నకిలీ ఆన్‌లైన్ పేమెంట్ స్క్రీన్‌షాట్ చూపించి రూ.10 వేలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరుకు పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
చార్మినార్ జోన్ మీర్‌చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్ వివరాల ప్రకారం... తెలంగాణ అసెంబ్లీలో జేజే నగర్ నివాసి కందూరి నవీన్ గార్డెనర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న రాత్రి సమయంలో పురానాహవేలిలోని సిటీ సివిల్ కోర్టు వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి రూ.20,000 డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి, తనకు నగదు అత్యవసరమని, రూ.10,000 నగదు ఇస్తే ఫోన్‌పే ద్వారా బదిలీ చేస్తానని నమ్మబలికాడు. నవీన్ తన గూగుల్ పే క్యూఆర్ కోడ్‌ను చూపించగా, సదరు వ్యక్తి స్కాన్ చేసి రూ.10,000 ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఒక నకిలీ స్క్రీన్‌షాట్‌ను చూపించాడు. అది నిజమేనని నమ్మిన నవీన్ అతడికి రూ.10,000 నగదు అందజేశాడు.
ఆ తర్వాత తన బ్యాంక్ ఖాతాను పరిశీలించగా డబ్బులు జమ కాలేదని గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి ఈనెల 8న మిర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పురానాహవేలి ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడిని భవానీనగర్, తలాబ్‌కట్టకు చెందిన అబ్దుల్లా ఒబైద్ బిన్ అబ్దత్ అల్ కతేరీ అలియాస్ అబ్దుల్లా (25)గా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ.4,000 నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన రెడ్‌మీ 15సి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పాత నేరస్థుడిగా గుర్తింపు..
అరెస్టయిన నిందితుడు వరుస నేరాలకు పాల్పడే అలవాటు ఉన్న వ్యక్తని పోలీసులు తెలిపారు. గతంలో మొఘల్‌పురా, సుల్తాన్ బజార్, కాంచన్‌బాగ్, చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటువంటి మోసాలు, ఇతర నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని వెల్లడించారు. ఈ నెల 6న సుల్తాన్ బజార్‌లోని ఇఎన్టీ ఆసుపత్రి వద్ద ఉన్న ఏటీఎంలో కూడా ఇదే రీతిలో ఒక వ్యక్తిని నమ్మించి రూ. 6,000 కాజేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
కేసు దర్యాప్తు చేసిన మిర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్ ఎం. కొండల్ రావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సైదయ్య, డీఐ ముజ్తబా అలీ ఖాసిం, సిబ్బంది వి.సాయికిరణ్ గౌడ్, వరుణ్, మహేష్‌లను చార్మినార్ జోన్ డీసీపీ ఖేర్ కిరణ్ ప్రభాకర్, అదనపు డీసీపీ ఎం.ఎ.మజీద్, మీర్‌చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్‌లు అభినందించారు.
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన




