Honda Electric Scooter | హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 145 కిలోమీట్లరు దూసుకెళ్లొచ్చు..!
Honda Electric Scooter | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో పోటీ మరింత ముదురుతున్న వేళ హోండా కొత్త ఈవీని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన ఈవీ పోర్ట్‌ఫోలియోలో మూడో మోడల్‌గా క్యూసీ3 (QC3)ను విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.35 లక్షలుగా నిర్ణయించింది.
Honda Electric Scooter | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో పోటీ మరింత ముదురుతున్న వేళ హోండా కొత్త ఈవీని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన ఈవీ పోర్ట్‌ఫోలియోలో మూడో మోడల్‌గా క్యూసీ3 (QC3)ను విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.35 లక్షలుగా నిర్ణయించింది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా వంటి మోడళ్లతో క్యూసీ3 పోటీపడనుంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 3kWh సామర్థ్యంతో కూడిన ఫిక్స్‌డ్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ వస్తుందని హోండా వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఈవీల్లో ఇదే అత్యధిక రేంజ్ అందించే మోడల్‌గా నిలిచింది.
2.40 గంటల్లో 80 శాతం
క్యూసీ3 బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం అవసరం. స్కూటర్‌లో 5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అవసరమైన రైడింగ్ సమాచారం ఇందులో కనిపిస్తుంది. హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను కూడా పొందొచ్చు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూసీ3లో విశాలమైన అండర్‌సీట్ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 32 లీటర్ల వరకు సామగ్రిని ఉంచుకోవచ్చు. రోజువారీ కొనుగోళ్లు, హెల్మెట్, బ్యాగులు వంటి వాటికి ఈ స్పేస్ ఉపయోగపడుతుంది.
నాలుగు కలర్ ఆప్షన్లు
క్యూసీ3 నాలుగు రంగుల్లో లభించనుంది. మ్యాట్ ఫోటాన్ గ్రే మెటాలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్, పర్ల్ షాలో బ్లూ, పర్ల్ సైరన్ బ్లూ కలర్ ఆప్షన్లను హోండా అందిస్తోంది. హోండా ఇప్పటికే క్యూసీ1, యాక్టివా ఈ పేర్లతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. క్యూసీ1లో 1.5kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉండగా.. 80 కి.మీ ఐడీసీ రేంజ్ వస్తుంది. దీని ధర రూ.90,708 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు యాక్టివా ఈలో రెండు 1.5kWh స్వాపబుల్ బ్యాటరీలు ఉన్నాయి. మొత్తం 3kWh సామర్థ్యంతో 102 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తుంది. ప్రారంభ ధర రూ.1.20 లక్షలు. క్యూసీ3లోనూ 3kWh బ్యాటరీనే ఉన్నప్పటికీ.. ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీ. 145 కి.మీ రేంజ్‌ను అందించడం దీని ప్రత్యేకత. ఈ స్కూటీ విక్రయాలను హోండా దశలవారీగా విస్తరించనుంది. మొదటి దశలో ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లాంలోని ఎంపిక చేసిన హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 22, 2026

CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 22, 2026

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి
- ●CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
- ●Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!
- ●Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!

Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!



