Shares | ఒక డీమ్యాట్ ఖాతా నుంచి ఇంకో ఖాతాకు షేర్లను ఇలా ఈజీగా బదిలీ చేయండి..!
Shares | షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలను డిజిటల్ రూపంలో భద్రంగా నిల్వ చేసుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇన్వెస్టర్లు షేర్ ట్రాన్స్‌ఫర్ విషయంలో పెద్దగా ఆలోచించరు. అయితే తక్కువ ఛార్జీలు లేదా మెరుగైన సేవల కోసం ఒక బ్రోకర్ నుంచి మరో బ్రోకర్‌కు మారే పరిస్థితులు తరచూ ఎదురవుతుంటాయి.
Shares | షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలను డిజిటల్ రూపంలో భద్రంగా నిల్వ చేసుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇన్వెస్టర్లు షేర్ ట్రాన్స్‌ఫర్ విషయంలో పెద్దగా ఆలోచించరు. అయితే తక్కువ ఛార్జీలు లేదా మెరుగైన సేవల కోసం ఒక బ్రోకర్ నుంచి మరో బ్రోకర్‌కు మారే పరిస్థితులు తరచూ ఎదురవుతుంటాయి. మీరు కొత్త డీమ్యాట్ అకౌంట్ తెరిచి, మీ పెట్టుబడులన్నింటినీ ఒకేచోట ఉంచాలనుకున్నా లేదా మీ జీవిత భాగస్వామి, పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులకు షేర్లను బహుమతిగా ఇవ్వాలనుకున్నా, ప్రస్తుతం షేర్ల బదిలీ ప్రక్రియ చాలా సులభంగా మారింది. ఒక బ్రోకర్ నుంచి మరొక బ్రోకర్‌కు మారేటప్పుడు షేర్ల బదిలీ విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఉదాహరణకు, మీ డీమ్యాట్ అకౌంట్ ఒక బ్రోకర్ వద్ద ఉండగా, మీరు మరో బ్రోకర్ సేవలను ఎంచుకుంటే, మీ పేరిట ఉన్న ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరో డీమ్యాట్ అకౌంట్‌కు షేర్లను బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఎన్ఎస్‌డీఎల్, సీడీఎస్ఎల్ ద్వారా..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ అందిస్తున్న ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీ అకౌంట్ ఏ డిపాజిటరీకి అనుసంధానమై ఉందో దాని ఆధారంగా ట్రాన్స్‌ఫర్ విధానం ఉంటుంది. చాలా మంది బ్రోకర్లు తమ యాప్‌లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా హోల్డింగ్స్ బదిలీ చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. బ్రోకర్ మారినా లేదా షేర్లను బహుమతిగా బదిలీ చేసినా, ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన అన్ని రికార్డులను భద్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ వివరాలు, కమ్యూనికేషన్ కాపీలు వంటి సమాచారం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈ బదిలీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయి. అయితే భవిష్యత్తులో యాజమాన్యం, కొనుగోలు ధర లేదా లావాదేవీల చరిత్రకు సంబంధించిన సందేహాలు తలెత్తితే, సరైన రికార్డులు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
ప్రస్తుతం సులభంగానే ప్రక్రియ..
డీమ్యాట్ అకౌంట్ల మధ్య షేర్ల బదిలీ చేయాలంటే చాలా పేపర్‌వర్క్ చేయాల్సి వస్తుందని, అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం చాలా ప్రక్రియలు పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జరుగుతున్నాయి. అనేక మంది బ్రోకర్లు ఆన్‌లైన్ ద్వారా నేరుగా షేర్ ట్రాన్స్‌ఫర్ ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ట్రాన్స్‌ఫర్‌కు ముందు అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం, అలాగే ఎలాంటి ఫీజులు లేదా పన్నులు వర్తిస్తున్నాయో తెలుసుకోవడం మంచిది. మీకు డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉన్న బ్రోకర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ ఆన్ లైన్‌లోనే ఎంతో సులభంగా పూర్తవుతుంది. అయితే ఆన్ లైన్ విధానం వద్దనుకునే వారికి ఆఫ్‌లైన్ పద్ధతి కూడా అందుబాటులో ఉంది.

ఆఫ్‌లైన్‌లో అయితే..
ఆఫ్‌లైన్‌లో షేర్లను ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి ఇంకో ఖాతాకు ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రస్తుత బ్రోకర్ నుంచి డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్)ను పొందాలి. అందులో పూర్తి వివరాలను నమోదు చేయాలి. 12 డిజిటల్ల ఐఎస్ఐఎస్ కోడ్‌ను ఎంటర్ చేయాలి. షేర్ల సంఖ్య ఎంత ఉంది, ఏయే షేర్లు ఉన్నాయి, వేటిని బదిలీ చేయాలో చెప్పాలి. టార్గెట్ క్లయింట్ ఐడీని నమోదు చేయాలి. షేర్లను ఏ అకౌంట్‌కు బదిలీ చేయదలిచారో ఆ ఖాతాకు చెందిన 16 డిజిట్ల కోడ్‌ను, ఆ ఖాతా డీపీ ఐడీని నమోదు చేయాలి. ఆఫ్ మార్కెట్ లేదా ఇంటర్ డిపాజిటరీలలో ఏదైనా ఒక బదిలీ విధానాన్ని ఎంచుకోవచ్చు. తరువాత సైన్ చేసి బ్రోకర్‌కు సబ్‌మిట్ చేయాలి. దీంతో అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. తరువాత 3 నుంచి 5 పనిదినాల్లో షేర్లు బదిలీ అవుతాయి. ఇక ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా చేయవచ్చు..
మీ షేర్లకు చెందిన డిపాజిటరీ సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్‌డీఎల్ అయి ఉంటుంది కనుక బ్రోకర్ సైట్‌లో లాగిన్ అయి ఆ వివరాలను ముందుగా తెలుసుకోవాలి. తరువాత రెండింటికీ వేర్వేరు వెబ్ సైట్లు ఉంటాయి కనుక సంబంధిత డిపాజిటరీ సైట్‌లోకి వెళ్లి షేర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ బ్రోకర్ ఖాతా సీడీఎస్ఎల్‌కు అనుసంధానం అయి ఉంటే షేర్లు కూడా అందులోనే ఉంటాయి కనుక సీడీఎస్ఎల్ వెబ్‌సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. లేదా ఎన్ఎస్‌డీఎల్ అయితే ఆ సైట్‌ను ఓపెన్ చేయాలి. సీడీఎస్ఎల్ సైట్‌లో ఈజియెస్ట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని రిజిస్టర్ చేయాలి. అదే ఎన్ఎస్‌డీఎల్ అయితే స్పీడ్-ఇ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత సీడీఎస్ఎల్‌లో సెటప్‌లోకి వెళ్లి బల్క్ ట్రాన్స్‌ఫర్‌పై క్లిక్ చేసి టార్గెట్ డీమ్యాట్ ఖాతా వివరాలను, ఐఎస్ఐఎన్‌ను ఎంటర్ చేయాలి. ఓటీపీని వెరిఫై చేసి కన్‌ఫామ్ చేయాలి. ఇక ఎన్ఎస్‌డీఎల్‌లో స్పీడ్-ఇ ద్వారా రిజిస్టర్ చేశాక రిసీవింగ్ డీమ్యాట్ ఖాతా వివరాలను నమోదు చేయాలి. అందులో ఇచ్చిన ఖాళీల్లో సమాచారం పొందు పరిచి అనంతరం సబ్‌మిట్ చేయాలి. ఇలా డిపాజిటరీని బట్టి షేర్ల బదిలీ ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలో షేర్లు 1 లేదా 2 పనిదినాల్లో బదిలీ అవుతాయి.
జాగ్రత్తలు పాటించాలి..
అయితే షేర్లను బదిలీ చేసే సమయంలో ప్లాట్‌ఫామ్‌లు స్వల్ప ఫీజును వసూలు చేస్తాయి. ఇది బ్రోకర్ ఆధారంగా మారుతుంది. అలాగే ఎస్ఐజీఐఎన్, షేర్ల సంఖ్య, వివరాలను కచ్చితంగా సరిచూసుకోవాలి. బ్రోకర్ ఖాతాను తెరిచినప్పుడు పెట్టే సంతకాన్ని అలాగే పెట్టాల్సి ఉంటుంది. అది రికార్డులతో మ్యాచ్ అవ్వాలి. ఇలా కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఇక జీరోధా వంటి కొందరు బ్రోకర్లు ఈ ఫీచర్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లోనే ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. అందులో ఉండే గిఫ్టింగ్ అనే ఫీచర్ ద్వారా షేర్లను సులభంగా బదిలీ చేయవచ్చు. ఇది బ్రోకర్ ప్లాట్‌ఫామ్‌ను బట్టి మారుతుంది.
సంబంధిత వార్తలు

Stock Markets | వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో లాభాలు.. కొనసాగుతున్న సూచీల ర్యాలీ..
జూన్ 18, 2026

Women | ఇన్వెస్టర్లుగా మారుతున్న మహిళలు.. స్టాక్ మార్కెట్లలో గణనీయంగా పెరిగిన పెట్టుబడులు..
జూన్ 16, 2026

IPO | రూ.36 కోట్ల ఎస్ఎంఈ ఐపీవో.. జూన్ 17న ఓపెన్.. పెట్టుబడి ఎంతంటే..
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
- ●Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
- ●Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం
- ●KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్
- ●Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - కిస్సిక్ సింగర్ వాయిస్‌తో...
- ●TG Weather | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు, వడగాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ

Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన

Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం

KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్



