త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు బ్లాక్ మండే.. భారీగా అమ్మ‌కాలు..

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు సోమ‌వారం బ్లాక్ మండేగా నిలిచిది. మార్కెట్ గ్యాప్ డౌన్‌తో ప్రారంభం అయిన వెంట‌నే భారీగా అమ్మ‌కాలు చోటు చేసుకున్నాయి. దీంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 భారీగా ఒత్తిడికి లోన‌య్యాయి. మొద‌టి 30 నిమిషాల్లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 850 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోయి 73వేల స్థాయికి చేర‌గా, నిఫ్టీ50 సూచీ 270 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మై 22,900 దిగువ‌కు వ‌చ్చింది.

S

Business | Published On Sep 28, 2026, 10.05 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు బ్లాక్ మండే.. భారీగా అమ్మ‌కాలు..
Advertisement

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు సోమ‌వారం బ్లాక్ మండేగా నిలిచిది. మార్కెట్ గ్యాప్ డౌన్‌తో ప్రారంభం అయిన వెంట‌నే భారీగా అమ్మ‌కాలు చోటు చేసుకున్నాయి. దీంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 భారీగా ఒత్తిడికి లోన‌య్యాయి. మొద‌టి 30 నిమిషాల్లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 850 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోయి 73వేల స్థాయికి చేర‌గా, నిఫ్టీ50 సూచీ 270 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మై 22,900 దిగువ‌కు వ‌చ్చింది. మార్కెట్‌ల‌లో ఆందోళ‌న‌ను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 14 శాతం పెరిగింది. ఇది భారీ స్థాయిలో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌న‌డాన్ని సూచిస్తుంది. అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం లేద‌ని తేల‌డంతో పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న నెల‌కొంది. దీంతో భారీ ఎత్తున అమ్మ‌కాలు చేప‌ట్టారు. మ‌రోవైపు పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్‌, ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా కూడా మార్కెట్లు ఒత్తిడికి గుర‌వుతున్నాయి.

అన్ని రంగాల్లోనూ భారీగా అమ్మ‌కాలు..

సోమ‌వారం సెష‌న్‌లో అన్ని రంగాల్లోనూ భారీగా అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ సెక్టార్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. దేశ‌వ్యాప్తంగా బ్యాంకు యూనియ‌న్లు త‌ల‌పెట్టిన స‌మ్మెను ప్ర‌స్తుతానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయ ప‌రిమాణాల నేప‌థ్యంలో ముందుగా బ్యాంకింగ్ రంగం ప్ర‌భావానికి గురైంది. త‌రువాత రియాల్టీ, క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌, టెలి క‌మ్యూనికేష‌న్‌, విద్యుత్‌, ఎఫ్ఎంసీజీ, మెట‌ల్స్‌, కెమిక‌ల్స్‌, ఐటీ రంగాలు భారీగా న‌ష్టాల‌ను చ‌విచూసిన జాబితాలో నిలిచాయి. అయితే హెల్త్‌కేర్‌, క‌న్‌జ్యూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, ఇన్సూరెన్స్‌, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమొబైల్స్ రంగాల్లో స్వల్ప న‌ష్టాలు న‌మోద‌య్యాయి. దీంతో మార్కెట్ల‌లో మ‌రింత భారీ ప‌తనానికి కాస్త బ్రేక్ ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌ర స్థాయిలోనే ఉన్నాయ‌ని, పెట్టుబ‌డిదారులు ఈ స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఇక ఆయా రంగాల‌కు చెందిన సూచీల విష‌యానికి వ‌స్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది. ఈ సూచీ ఏకంగా 1.87 శాతం తగ్గింది. త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా రియాల్టీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్స్‌, ప్రైవేట్ బ్యాంక్స్ నిలిచాయి. విస్తృత స్థాయి మార్కెట్ల‌లోనూ అమ్మ‌కాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.17 శాతానికి పైగా ప‌త‌న‌మైంది. నిఫ్టీ మీడియా సూచీ మాత్రం లాభాల్లో నిలిచింది. ఈ సూచీ 0.35 శాతం పెరిగింది. మిగిలిన అన్ని సూచీలు ఎరుపు రంగులోనే కొన‌సాగుతున్నాయి. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. ముడి చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంద‌నే ఆందోళ‌న‌తో చ‌మురు ధ‌ర‌లు ఈ సెష‌న్‌లో భారీగా ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర ఏకంగా 1.26 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 98 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.27 శాతం పెరిగి బ్యారెల్‌కు 97 డాల‌ర్ల వద్ద నిలిచింది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.93 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.14 శాతం న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement