త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boggula Srinivas | బొగ్గుల శ్రీనివాస్‌ది హ‌త్యే.. జీఎస్టీ కట్టమ‌ని అడిగినందుకు చంపేశారు.. ..!

Boggula Srinivas | రచయిత బొగ్గుల శ్రీనివాస్‌(48)ది సుపారీ హత్యేనని పోలీసులు తేల్చారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని దర్యాప్తులో తేలింద‌ని పోలీసులు పేర్కొన్నారు.

S

Telangana | Published On Feb 22, 2026, 3.28 pm IST

Boggula Srinivas | బొగ్గుల శ్రీనివాస్‌ది హ‌త్యే.. జీఎస్టీ కట్టమ‌ని అడిగినందుకు చంపేశారు.. ..!
Advertisement

Boggula Srinivas | త్రినేత్ర‌.న్యూస్ : రచయిత బొగ్గుల శ్రీనివాస్‌(48)ది సుపారీ హత్యేనని పోలీసులు తేల్చారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని దర్యాప్తులో తేలింద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు వేణుమాధ‌వ రెడ్డి స‌హా న‌లుగురిని కూసుమంచి పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్‌పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.

బొగ్గుల శ్రీనివాస్ హ‌త్య‌కు జీఎస్టీనే కార‌ణం..

ఏపీలోని ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లికి చెందిన వేణుమాధ‌వ రెడ్డి.. బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ ప‌ర్మిష‌న్‌ను వాడుకున్నాడు. అయితే మాధ‌వ‌రెడ్డి జీఎస్టీ క‌ట్ట‌కుండా ఎగ్గొట్టారు. దీంతో శ్రీనివాస్‌కు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఒప్పందం మేర‌కు న‌గ‌దు ఇవ్వాల‌ని, జీఎస్టీని తిరిగి ఓపెన్ చేయాల‌ని మాధ‌వ‌రెడ్డిని శ్రీనివాస్ కోరాడు. దీంతో ఇరువురి మ‌ధ్య తీవ్ర వివాదాలు చోటు చేసుకున్నాయి. డ‌బ్బులు ఇవ్వాల‌ని శ్రీనివాస్ మ‌రింత ఒత్తిడి తేవ‌డంతో అత‌న్ని చంపాల‌ని మాధ‌వ‌రెడ్డి నిర్ణ‌యించుకున్నాడు. శ్రీనివాస్‌ను కారులో విజయవాడ తీసుకెళ్తూ నార్కెట్‌పల్లి వద్ద హత్య చేయించాడు. అనంతరం పాలేరు రిజర్వాయర్‌లో కారు తోసేసి ప్రమాదంగా చిత్రీకరించాడు.

Advertisement
Advertisement