Team India | ఐర్లాండ్లో పర్యటించనున్న భారత జట్టు.. షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ..!
Team India | భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఈ టూర్‌లో ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడుతుంది. ఈ మేరకు బీసీసీఐ సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించింది.
Team India | భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఈ టూర్‌లో ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడుతుంది. ఈ మేరకు బీసీసీఐ సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్ గతంలో ఐర్లాండ్లో 2018, 2022, 2023లో పర్యటించింది. గత ఎనిమిదేళ్లలో ఐర్లాండ్‌లో మూడుసార్లు పర్యటించింది. ఈ సిరీస్‌లోని రెండూ మ్యాచ్‌లు బెల్‌ఫాస్ట్‌లో జరుగనుననాయి. 2007 తర్వాత బెల్‌ఫాస్ట్‌లో భారత్ మ్యాచులు ఆడడం ఇదే తొలిసారి. భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20 జూన్ 26న, రెండో టీ20 జూన్ 28న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత సమయం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐర్లాండ్ హైపర్ ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రహం వెస్ట్ సిరీస్‌ను ధ్రువీకరించగా.. తాజాగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ తర్వాత భారత జట్టు జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడుతుంది. జులై ఒకటి నుంచి జులై 19 వరకు సిరీస్ కొనసాగుతుంది.
https://x.com/BCCI/status/2035198859870392698
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






