Gold And Silver Prices Today | బంగారం ధరలకు బ్రేక్.. డాలర్ బలంతో గోల్డ్ పతనం..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. బలపడిన అమెరికా డాలర్, పెరుగుతున్న ముడి చమురు ధరలు బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. బలపడిన అమెరికా డాలర్, పెరుగుతున్న ముడి చమురు ధరలు బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చాయి. అదే సమయంలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం చుట్టూ నెలకొన్న అనిశ్చితిపై కూడా పెట్టుబడిదారులు దృష్టి సారించారు. ఉదయం ఎంసీఎక్స్ ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 0.66 శాతం తగ్గి 1,59,850 వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు జూలై సిల్వర్ ఫ్యూచర్స్ 2,66,979 వద్ద దాదాపు స్థిరంగా కొనసాగాయి. అమెరికా మార్కెట్లలో కూడా బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం పడిపోయి ట్రాయ్ ఔన్స్‌కు 4,558.10 డాలర్లకు చేరాయి. డాలర్ ఇండెక్స్ సుమారు 0.20 శాతం పెరగడంతో ఇతర కరెన్సీల్లో కొనుగోలు చేసే వారికి బంగారం మరింత ఖరీదైంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,622 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 976 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,56,220 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,62,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,320 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,560గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,32,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,717 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,736గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,170 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,71,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,100 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,90,000 ఉండగా, తులం ధర రూ.2,900 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..?
మే 30, 2026

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. కొనుగోళ్లలో జోరు..
మే 29, 2026

Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనేందుకు ఇది సమయమేనా..?
మే 28, 2026
తాజావార్తలు
- ●AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?
- ●CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు
- ●Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- ●Cabinet Expands | బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
- ●Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?

AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?

CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్

Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ



