Google Pay | గూగుల్ పే లో జెమిని ఏఐ.. కొత్త ఎస్‌బీఐ ఫ్లెక్స్ కార్డు కూడా..
Google Pay | గూగుల్ పే వినియోగదారుల కోసం ఆ సంస్థ కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. గూగుల్ పే యాప్‌లో జెమిని ఆధారిత ఏఐ ఫీచర్ ఆస్క్ గూగుల్ పే ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఎస్‌బీఐ కార్డ్ భాగస్వామ్యంతో గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ కార్డ్ ను కూడా ప్రారంభించింది.
Google Pay | గూగుల్ పే వినియోగదారుల కోసం ఆ సంస్థ కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. గూగుల్ పే యాప్‌లో జెమిని ఆధారిత ఏఐ ఫీచర్ ఆస్క్ గూగుల్ పే ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఎస్‌బీఐ కార్డ్ భాగస్వామ్యంతో గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ కార్డ్ ను కూడా ప్రారంభించింది. ఈ రెండు కొత్త ఫీచర్లు వినియోగదారులు తమ ఖర్చులను అర్థం చేసుకోవడం, ఆర్థిక సమాచారం తెలుసుకోవడం, రోజువారీ క్రెడిట్‌ను సులభంగా నిర్వహించడంలో సహాయపడతాయని గూగుల్ తెలిపింది. యూపీఐ వల్ల డిజిటల్ చెల్లింపులు చాలా సులభమయ్యాయి. అయితే ఖర్చులు ఎలా జరుగుతున్నాయి, డబ్బు ఎక్కడ ఎక్కువగా వెళ్తోంది, పొదుపు ఎలా పెంచుకోవాలి వంటి విషయాలను అర్థం చేసుకోవడంలో చాలామందికి ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఆస్క్ గూగుల్ పే అనే ఆప్షనల్ ఏఐ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా..
గూగుల్ జెమిని మోడల్స్ ఆధారంగా పనిచేసే ఈ ఏఐ అసిస్టెంట్ వినియోగదారుల ఖర్చుల విశ్లేషణ, పొదుపు సూచనలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఆఫర్లు, అలాగే ఎస్‌ఐపీ, క్రెడిట్ స్కోర్ వంటి ఆర్థిక అంశాలపై అవగాహన కల్పిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఖర్చుల సరళిని విశ్లేషించి డబ్బు ఎక్కడ ఎక్కువగా ఖర్చవుతుందో తెలుసుకోవచ్చు. మెరుగైన పొదుపు, డబ్బు నిర్వహణపై సూచనలు పొందవచ్చు. ప్రయాణ ఖర్చులకు సరిపోయే క్రెడిట్ కార్డు వంటి వ్యక్తిగత ఆఫర్లను కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఎస్‌ఐపీ, క్రెడిట్ స్కోర్, కాంపౌండింగ్ ఇంటరెస్ట్, పాత పన్ను విధానం-కొత్త పన్ను విధానం మధ్య తేడాలు వంటి ఆర్థిక అంశాలపై సులభంగా సమాచారం పొందవచ్చు. ఈ ఏఐ అసిస్టెంట్ గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీతోపాటు గూగుల్ పేలో అందుబాటులో ఉన్న సిబిల్ రిపోర్ట్ ఆధారంగా వ్యక్తిగత సూచనలు అందిస్తుంది. వినియోగదారులు టెక్స్ట్ ద్వారా లేదా వాయిస్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. ఈ ఫీచర్ 10 భారతీయ భాషలకు మద్దతుతో అందుబాటులో ఉంది.
ప్రత్యామ్నాయం కాదు..
అయితే ఈ ఫీచర్ కేవలం విద్యాపరమైన ఆర్థిక సమాచారాన్ని మాత్రమే అందిస్తుందని, ఇది ప్రొఫెషనల్ ఆర్థిక సలహాకు ప్రత్యామ్నాయం కాదని గూగుల్ స్పష్టం చేసింది. ఏఐ ఆధారంగా పనిచేసే కారణంగా కొన్నిసార్లు సమాధానాల్లో పొరపాట్లు ఉండే అవకాశం కూడా ఉందని తెలిపింది. అలాగే పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు, పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు లేదా ఇతర సున్నితమైన ఆర్థిక వివరాలను ఆస్క్ గూగుల్ పే తో పంచుకోవద్దని వినియోగదారులకు సూచించింది. వినియోగదారుల అనుమతితో గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ, సిబిల్ రిపోర్ట్ వంటి సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తిగత సూచనలు అందిస్తామని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే గూగుల్ పేలో పర్సనలైజేషన్ సెట్టింగ్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్‌గా ఈ సెట్టింగ్ ఆఫ్‌లోనే ఉంటుంది.

డేటా సురక్షితం..
వినియోగదారుల డేటా పూర్తిగా గూగుల్ పే ఎకోసిస్టమ్‌లోనే ఉంటుందని, థర్డ్ పార్టీ యాప్‌లతో పంచుకోబోమని గూగుల్ వెల్లడించింది. అలాగే ఈ డేటాను గూగుల్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబోమని స్పష్టం చేసింది. పూర్తి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు, పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు లేదా ప్రభుత్వ ఆర్థిక గుర్తింపు వివరాలను ఆస్క్ గూగుల్ పే యాక్సెస్ చేయదని తెలిపింది. గూగుల్, ఎస్‌బీఐ కార్డ్ భాగస్వామ్యంతో గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ కార్డ్ ను ప్రారంభించింది. ఈ కార్డు రూపే నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. వినియోగదారులు ఎలాంటి భౌతిక పత్రాలు సమర్పించకుండా నేరుగా గూగుల్ పే యాప్ నుంచే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు రూపే, వీసా రెండు పేమెంట్ నెట్‌వర్క్‌లలో పనిచేస్తుంది. ఫ్లెక్స్ ట్రాన్సాక్షన్‌లపై స్టార్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రతి 1 స్టార్ విలువ రూ.1గా ఉంటుంది. సంపాదించిన స్టార్స్‌ను అర్హత కలిగిన లావాదేవీల్లో వెంటనే రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే తాజా క్రెడిట్ కార్డ్ బిల్లును ఈఎంఐగా మార్చుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ఫ్లెక్స్ కార్డు సదుపాయాలు..
త్వరలో ఫ్లెక్స్ కార్డు వినియోగదారులకు గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌పై ఒక సంవత్సరం పాటు 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇందులో 400 జీబీ, 2 టీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే రోజువారీ కొనుగోళ్లపై మరిన్ని స్టార్స్ పొందే అవకాశం ఉండటంతోపాటు గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక తగ్గింపులు కూడా లభిస్తాయి. ఆస్క్ గూగుల్ పే ప్రస్తుతం భారత్‌లో పరిమిత సంఖ్యలో ఉన్న అర్హత కలిగిన వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. అందువల్ల ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ అందుబాటులో లేదు. యూజర్లందరికీ త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇక గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ కార్డ్ అర్హత కలిగిన వినియోగదారులకు గూగుల్ పే యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. యూజర్లు తమ గూగుల్ పే యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసి కార్డు పొందేందుకు అర్హులు అవుతారో కాదో చెక్ చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

UPI Payment Splitting Risk | చార్జీలు తప్పించుకునేందుకు ఒకే బిల్లును పదే పదే రూ.2000 చొప్పున స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చా?
సెప్టెంబర్ 26, 2026

Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
సెప్టెంబర్ 21, 2026

యూపీఐకి బడ్జెట్ పెట్టలేరా?.. ప్రజల లావాదేవీలే ఆదాయ వనరా?
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం
- ●CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
- ●Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం

Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం

CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్



